పుట:1857 ముస్లింలు.pdf/258

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైన త్యాగాలు

గ్రంథాల ఆధారంగా బ్రిటిష్‌ ప్రభుత్వం,బ్రిటిష్‌ అధికారులు, బ్రిటిష్‌ మేధావులు, క్రైస్తవ మిషనరీలు కూడగట్టుకుని మధ్య యుగాల ముస్లిం రాజులను హిందువుల పట్ల,హిందూ

మత గ్రంథాల పట్ల, హిందూ దేవాలయాల పట్ల అత్యంత క్రౌర్యంగా వ్యవహరించిన

హంతకులని, విధ్వంసకులని, నియంతలని ప్రచారంచేశారు. ఈ వరుసలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, ముహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ దగ్గర నుండి చివరకు బాబర్‌, అక్బర్‌, ఔరంగజేబ్‌ లను అప్రతిష్టపాల్జేసి అన్నివిధాల హిందువులను హింసించిన హిందూ వ్యతిరేకులుగా, ప్రజల సంక్షేమం పట్టని భోగలాలసులుగా చిత్రించగలిగారు.

ఆ బాటలో Sir Henry William Elliot లాంటి ఆంగేయాధికారి తాను సంకలనం చేసిన గ్రంథం ప్రస్తావనలో ముస్లింలు తమతో వివాదం పెట్టుకున్నహిందాువులను నిర్దాక్షిణ్యంగా హతమార్చేవారు. వారి దేవాలయాలను ధ్వంసంచేసి, వారి దేవతా విగ్రహాలను ఛిన్నాభిన్నం చేసేవారు. బలవంతపు మతమార్పిడులు, బలవంతపు మతాంతర వివాహాలు, సామూహిక హత్యలు జరిపేవారు, మరణదండనలు, దేశ బహిష్కార శిక్షలు, కొరడా దెబ్బలులాంటి కఠిన శిక్షలు విధించేవారు. ముస్లింలు త్రాగుబోతులు, భోగలాలసులు అని రాశాడు. (భారతీయ ముస్లింలు, షాలీ రహంతుల్లా, అనంతపురం, 2003, పేజిలు.27-28)

ఈ విధంగా అటు చరిత్ర గ్రంథాలను రూపొందించడం, ఆ చరిత్ర గ్రంథాలకు ప్రజలలో మంచి ప్రచారం కల్పించడం, వాటిని పాఠశాలలు-కళాశాలలలో విద్యారులకు బోధించడం మొదలైన చర్యల ద్వారా ముస్లిం ప్రభువుల పాలన కన్నా ఆంగ్లేయ పాలన మిన్న అనే భావజాలాన్ని ప్రజలలో ప్రచారం చేసి అత్యధిక ప్రజా శ్రేణుల సమ్మతిని సాధించటంలో బ్రిటిష్‌ ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించగలిగింది.

ఈ ప్రయ త్నాల ప్రబావం చాలామంది భారతీయ మేధావుల మీద కూడాగాఢంగా పడింది. ఈ మేధావులు ఆంగ్లేయులు సృష్టించిన అవాస్తవ చరిత్రను వాస్తవ చరిత్రగా నమ్మి ముస్లిం ప్రభువుల పట్ల మాత్రమే కాకుండాముస్లిం ప్రజల పట్ల కూడావ్యతిరేక భావనలను ప్రతిష్టించుకున్నారు. ప్రభువులు-పాలకులు వేర్వేరన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండాపాలకుల తప్పిదాలను పాలితులకు అంటకట్టారు. పాలకులు ఎవరైనా పాలితుల పట్ల ఒకే రకంగా వ్యవహరిస్తారనీ, తమ అధికారాన్ని, పెత్తనాన్ని ప్రశ్నించే ప్రజల పట్ల హిందూ ప్రబువులైనా, ముస్లిం పాలకులెరైనా ఒకే రకంగా ప్రతిస్పందిస్తారన్న


255