పుట:1857 ముస్లింలు.pdf/256

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


విస్మరణకు గురైన త్యాగాలు

ఆ క్రమంలో ఆంగ్లేయ చరిత్రకారుడు జేమ్స్‌ మిల్‌ (James Mill) History of British India గ్రంథాన్ని రచించి, ఆ గ్రంథంలో పాలకుల మతాన్నిబట్టి భారతదశ చరిత్రను 'హిందూ యుగం', 'ముస్లిం యుగం', 'బ్రిటిష్‌ యుగం' అని విభజించాడు. హిందూ రాజుల పాలనను హిందూ యుగంగా, ముస్లిం రాజుల పాలనను ముస్లిం యుగంగా, ఆంగ్లేయుల పాలనా కాలాన్ని మాత్రం క్రైస్తవ యుగం అనకుండా బ్రిటిష్‌ యుగంగా విభజించి చరిత్రకు మతాన్ని జోడించి దుర్మార్గం చేశాడు. ఆ దుర్మార్గంలో భాగంగా ముస్లింల పాలనను a notorious tale of unprovoked aggression, unprincipled ambition, insurrection, disorder, insecurity, tyranny as well as dynastic revolutions అని అభివర్ణిస్తూ తన భాధ్యతను మరింత విజయవంతంగా నిర్వహించాడు.

ఈ రాతలు రాస్తున్నప్పుడు ఇండియాలోని ముస్లింలలో అత్యధికులు భూమి పుత్రులన్న విషయాన్నిబ్రిటిష్‌ చరిత్రకారులు ఉదేశ్య పూర్వకంగా విస్మరించారు. ముస్లింలు అనగానే విదేశీయులన్నభావనను స్థానికంగా ఉన్న ముస్లిమేతర ప్రజలలో బలంగా ప్రచారం చేశారు. ఆ విధంగా ప్రచారం చేసి ముస్లింలను ఇండియాలోని ముస్లిమేతరుల నుంచి దూరం చేయాలని ఆంగేయులు ఉద్దేశించారు. ఈ క్రమంలో బ్రిటిష్‌ ప్రబుత్వం ప్రజలకు, ముఖ్యంగా హిందూ ప్రజలకు, లభించిన గొప్ప వరంగా అభివర్ణిస్తూ, అందుకు అనుగుణంగా గ్రేట్ బ్రిటన్‌ నైతికంగా, మేధోపరంగా ఇండియాను పాలించగల అత్యుత్తమ సత్తా కలిగిఉందని చెప్పుకొచ్చారు, ప్రచారం చేసుకున్నారు.

రాజ్యాలు పోయినా, రాజరికం అంతరించినా, అధికారాలను కొల్పోయినా ముస్లిం ప్రభువుల, ఆ పాలకుల వారసులపట్ల స్థానికులు, ప్రధానంగా హిందువులు చూపుతున్న విధేయతను ఆంగ్లేయులు జీర్ణం చేసుకోలేక పోయారు. అధికారాలు లేకున్నాస్థానిక పాలకుల పట్ల ప్రజలలో గాఢంగా నెలకొన్న గౌరవాభిమానాల దృష్ట్యా, ఆంగ్లేయులకు భారత దేశం మీద సంపూర్ణ ఆధిపత్యం సంప్రాప్తించినా పరిపాలన మాత్రం స్థానిక ప్రభువుల పేరిట మాత్రమే సాగించాల్సి వచ్చింది. 1765 నాటి షా ఆలం దగ్గర నుండి 1857 నాటిచివరి మొగల్‌ ప్రబువు బహదూర్‌ షా జఫర్‌ వరకు ఈ పద్ధతిని ఆంగ్లేయులు పాించాల్సిన అగత్యం ఎదురయ్యింది.

ఒక సమయంలో బహదాూర్‌ షా జఫర్‌ చక్రవర్తిగా తన వారసుడ్నిప్రకటించే

253