పుట:1857 ముస్లింలు.pdf/255

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

Press,1970) లో British administrators, scholars, historians and missionaries, all became seriously involved in making the people to believe that British rule was better than the medieval Muslim Rule అన్నాడు.

బ్రిటిషర్ల పాలన ముస్లింల పాలన కంటే భేషైనదన్న భావం ప్రజలలో కలుగు చేయాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆంగ్లేయులు తొలుతగా Ancient Indian Civilization ను శ్లాఫిుస్తూ గ్రంథాలు సృష్టించారు. ఆనాటి శ్లాఘనీయ Ancient Indian Civilization వినాశనానికి ముస్లిం పాలకుల దాడులు కారణమని ఆరోపణలు చేశారు. ఈ కృషిలో Sir William Jones, Thomas Maurice లాంటి చరిత్రకారులు ప్రధాన పాత్ర వహించారు. ఆంగ్లేయులు నిర్దేశించుకున్న గమ్యం దిశగా చరిత్ర రచన చేసిన ఈ రచయితలు తమ గ్రంథాలలో ముస్లింల పట్ల పచ్చి విద్వేషాన్ని వెళ్లగ్రక్కారు. Sir William Jones ఆరంభించిన విద్వేష ప్రచారాన్ని Thomas Maurice కొనసాగిస్తూ, తాను రాసిన Modern History of Hindustan లో ముస్లిం విద్వేషకుని పాత్రను ప్రతిభావంతంగా పోషిస్తూ, ముస్లిం ప్రభువులను విధ్యంసకులు, కాముకులు, కర్కశులు, వినాశకులు, భోగలాలసులని అభివర్ణించాడు.

ముస్లిం వ్యతిరేక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెడుతూ ఇస్లాం విద్వేషకుడిగా ప్రసిద్ధిపొందిన Charles Grant ముస్లిం పాలకులను కాముకులు, మత దురహంకారులుగా (Sensual, begotted) చిత్రిస్తూ వినాశకరమైన రంగులను పులిమాడు. G.R Cleig ఇస్లాం మీద దాడి ఆరంభించాడు. ముహమ్మద్‌ ప్రవక్త జీవితం మీద ఆధారాలు లేని విమర్శనాత్మక బాణాలను సంధించాడు. ముస్లిం పాలకుడు ముహమ్మద్‌ఘోరి చర్యలను దుయ్యబడుతూ మతావేశంగల అతడు హిందూ దేవాలయాల విధ్వంసకుడనీ, జలాలుద్దీన్‌ ఖిల్జీని వంశపాలన కోసం రక్తపుటేరులు పారించిన భయంకరుడనీ, ముహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ను రాక్షసుడని, ఆడమగ వృద్ధులు, పసివారన్న తేడాలేకుండా భయంకర హత్యాకాండ జరిపిన దుర్మార్గుడని రాసుకున్నాడు.

ఈ విధాంగా తమ లక్ష్యానికి అనుగుణంగా అత్యధిక సంఖ్యలో ఉన్న ముస్లిమేతర ప్రజల మనస్సులో ముస్లిం పాలకుల పట్ల విద్వేష భావజాలాన్ని పెంచి పోషించే గట్టి వాతావరణం ఏర్పాటు చేసుకున్న తరువాత తమ ప్రభుత్వానికి నైతిక మద్దతును కూడగట్టే ప్రయత్నంలో, ముస్లిం ప్రభువులు నియంతలన్న అపప్రధను ఆంగ్లేయ రచయితలు, చరిత్రకారులు విజయవంతంగా అంటగట్టారు.

252