పుట:1857 ముస్లింలు.pdf/253

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

లాంటి వారిని కూడా 1957లో పూర్తిగా విస్మరించారు. ఆయన ఆంగ్ల సైన్యాలను పలు మార్లు పరాజితుల్ని చేసి బ్రిటిష్‌ సైన్యాధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. ఆ యోధుని ధాటికి తట్టుకోలేక పోయిన కంపెనీ ప్రభుత్వం మౌల్వీని సజీవంగా గానీ నిర్జీవంగా గానీ పట్టి ఇచ్చిన వారికి 50 వేల రూపాయల నజరానా ప్రకటించింది. ఆనాడు మరెవ్వరి కోసమూ అంత నజరానాను బ్రిటిష్‌ ప్రబుత్వం ప్రకంచిన దాఖలాలు లేవు. నూటయాభై సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి తలకు ఆంగ్ల ప్రభుత్వం 50వేల రూపాయల ఖరీదు కట్టిందంటే ఆ యోధుడు ఎంతటి రణధీరుడో అర్థం చేసుకోవచ్చు.

ఆరంభం నుండి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం సాగించి అసువులు బాసిన బేగం హజరత్‌ మహల్‌, బేగం అజీజున్‌ ఎందుకు, ఎలా విస్మరణకు గురయ్యారు? అదే సందర్భంలో గత్యంతరంలేని పరిస్థితుల్లో, డోలాయమాన మానసిక అవస్థలో యుద్దరంగ ప్రవేశం చేసిన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లాంటివాళ్ళు అన్ని వేళలా ఎలా స్మరణకు వస్తున్నారు? ఇదే విధంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో సాహసోపేత చర్యల ద్వారా చరిత్రలో ప్రత్యేక అధ్యాయాలను సృష్టించిన అజీముల్లా ఖాన్‌, ఖాన్‌ బహదాూర్‌ ఖాన్‌, భక్త ఖాన్‌, మౌల్వీ లియాఖత్‌ అలీ, మౌల్వీ అహ్మద్‌ అలీ ఖాన్‌, సర్దార్‌ హిక్మతుల్లా, ఫిరోజ్‌ షా లాంటి యోధులు ప్రజల స్మతిృపధంలోకి ఎందుకు రావడం లేదు. ప్రభుత్వాల విస్మరణకు ఎందుకు గురయ్యారు?

ఈ పరిస్థితికి ఒకవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం మరొకపైపు హిందూ-ముస్లింల మధ్య ఏర్పడిన మానసిక ఎడం ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ అవాంఛనీయ మానసిక వాతావరణం ఏర్పడడానికి ఆంగ్ల ప్రభుత్వం, ఆంగ్ల చరిత్రకారులు 1857 నుండే బీజాలు వేశారు. ఆ విధంగా మొలిచిన మొలకలకు ఆంగ్ల చరిత్రకారుల కథనాల మీద ఆధారపడి స్వదేశీ చరిత్రకారులు సృష్టించిన చరిత్ర నీళ్ళుపోసి-ఎరువు వేసి వృక్షాలుగా ఎదగడానికి సహయపడింది. ఈ వృక్షాలను మతోన్మాదం ఆసరాతో రాజ్యాధికారాన్ని చేప్టాలన్న లక్ష్యంతో చరిత్ర రచనకు మతతత్వం దృక్పథాన్ని జోడించి నిరంతరం ఆ దిశగా కృషి సల్పుతున్న శక్తులూ-వ్యకులూ వటవృక్షాలుగా మార్చుతున్నారు. ఆ కారణంగా హిందూ-ముస్లింల మధ్య మానసిక విభజన రేఖ మరింతగా బలపడుతూ విషపూరిత, విస్మరణ వాతావరణం సృష్టించబడుతోంది.

ఇండియాను క్రమంగా చేజిక్కుంచుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం తన పరిపాలనకు

250