పుట:1857 ముస్లింలు.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదించుకుని అందలాలెక్కి అధికారం చలాయిస్తున్నారు. అందివచ్చిన సంపదతో పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలుగా మారి మరింత సంపన్నులుగా మరికొందరు ప్రజా జీవితాలను శాసించగలగుతున్నరు. అత్యధికులు అధికారంతోపాటు మరింత సంపద కూడ బెట్టుకునే అవకాశాలను తమ గుప్పెట పెట్టుకుని అన్ని సౌఖ్యాలు అనుభవిసున్నారు.

ఆనాడు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాట సాగిన యోధుల వారసులలో చాలా మంది సర్వం కోల్పోయి ఆచూకి కూడ కానరాని దుస్థితిలో ఉన్నారు. చిన్నచితకా పనులు చేసుకుంటూ బ్రతుకులు వెళ్ళమార్చుతున్నారు. అలనాటి త్యాగమూర్తుల కుటుంబాలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రభుత్వాది నేతలు కూడా తమ ప్రయోజనాలకనుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలలో బాగా ప్రచారం పొందిన యోధుల గురించి మాత్రమే మళ్ళీ మళ్ళీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలలో తామేదో చేస్తూన్నామన్న ప్రచారాన్ని కల్పించుకుంటున్నారు. ప్రజలు మర్చిపోయిన, ప్రజలకు తెలియని త్యాగదనులను, సాహస వీరులను ఏమాత్రం గుర్తుకు చేయడంలేదు. ఆ యోధుల స్మృతిగా చిన్నపాటి కార్యక్రమాలు కూడ నిర్వహించడం లేదు. ఆ కారణంగా అలనాటి యోధుల స్మృతులు, ఆ యోధుల వారసుల పరిస్థితులు ప్రజలకు తెలియకుండా పోతున్నాయి.

అలనాటి మహోన్నత చరిత్రకు ప్రాణం పోసిన పోరాట యోధుల చరిత్ర తెలుసుకుందామని ప్రయత్నించే చరిత్రకారులు, నిత్యాన్వేషకులెన పాత్రికేయులు, చరిత్ర పట్ల ప్రత్యేకాసక్తి గల ప్రజల కృషి పుణ్యమా అని అప్పుడప్పుడు అక్కడక్కడా అలనాటి యోధుల వారసులు కొంత మంది వెలుగులోకి వస్తున్నారు. ఆ విధాంగా మీడియా ద్వారా పదిమందికి దృష్టికి వచ్చినా వారు గుర్రపుబండి నడుతున్నారనో బడ్టీకొట్టు పెట్టుకున్నారనో, టీ-కాఫీలు అమ్ముకుంటున్నారనో, రిక్షా లాగుతున్నారనో, ఎవ్వరూ లేని అనాధలా మందుల కోనుగోలుకు కూడ శక్తిలేక కటిక పేదరికంలో కన్నుమూశారనో ప్రత్యేక కథానాలలో మాత్రమే ఆ త్యాగధనుల వారసుల దుర్భర బ్రతుకు గాధలు వెల్లడి కావడం, అప్పుడప్పుడు తెరల మీద దర్శనమిస్తుండటం చారిత్రక విషాదాం.