పుట:1857 ముస్లింలు.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
1857:ముస్లింలు


సిద్ధమైన ఆయనను పూర్తిగా నిరుత్సాహపర్చారు. ఆ సమయంలో దాడి మంచిది కాదన్నారు. ఆంగ్లేయల విజయం ఖాయమన్నారు. ఆయన కుటుంబ సభ్యుల యోగక్షేమాలు గుర్తుకు తెచ్చారు. ఆంగ్లేయ విజేతల నుండి మొగల్‌ వంశస్థుల ప్రాణాలు దక్కాలంటే బహదూర్‌ షా జఫర్‌ పోరాట ప్రయత్నాలను విరమించక తప్పదని ద్రోహపూరిత సలహాలు ఇచ్చారు.

చివరకు సెప్టంబరు 12వ తేది రాత్రి అంతóపురం నుండి యుద్ధయోధుడి వస్త్రధారణతో బయలు దేరిన బహదూర్‌ షా తన వియ్యంకుడైన మీర్జా ఇలాహి బక్ష్ ఆ కుట్రలో ప్రదాన పాత్రదారి, రాజవైధ్యుడు అసహనుల్లా ఖాన్‌ల దుర్భోదకు గురయ్యారు. చక్రవర్తిని యుద్ధ విముఖుడ్నిచేయ డంలో ఆ ఆంగ్లేయుల తొత్తులు విజయం సాధించారు. సమరశంఖారావం పూరించిన బహదూర్‌ షా నగరం వెలుపలికి వస్తూ వస్తూ నమాజు సమయం ఆసన్నమైనదంటూ తిరిగి కోటలోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన కోట బయటకు రాలేదు. చక్రవర్తి రాకకోసం అర్ధ రాత్రి వరకు ఎదురు చూసిన స్వదేశీ యోధులు, ప్రజలు హతాశులై పెద్ద సంఖ్యలో నగరాన్ని వదలి వెళ్ళి పోయారు.

ఆ కారణంగా ఎర్రకోట నుండి ఆంగ్లేయులతో పోరాడుతున్నతిరుగుబాటు యోధుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆ రాత్రి ఆంగ్ల బలగాల దాడి భయంకర రూపం దాల్చింది. ఎర్రకోట రక్షణకు నిలబడిన కొద్దిపాటి తిరుగుబాటు యోధులు ప్రాణాలకు తెగించి పోరు సాగించారు. చివరకు సెప్టెంబరు 14న కాశ్మీర్‌ గటును పేల్చివేసి ఎర్రకోట లోకి ప్రవశించాయి.1857 19న ఎర్రకోట పూర్తిగా ఆంగ్లేయు వశమైంది. (The Great Mutiny, Christopher Hibbert, 1978, Pp. 278-279)

ఈ విధంగా మీర్జా ఇలాహి బబక్ష్ నమ్మకద్రోహానికి పాల్పడి అటు స్వజనులకు ఇటు స్వదేశానికి తీరని ద్రోహం చేశాడు. ఆ మిర్జా ఇలాహి బబక్ష్ గురించి బహదూర్‌ షా జఫర్‌ మునిమనుమరాలు కమర్‌ సుల్తానా ఈ విధంగా చెప్పారు:

మీర్జా ఇలాహి బక్ష్ బహదూర్‌ షా జఫరకు వియ్యంకుడు. ఆయన విద్రోహానికి పాల్పడ్డారు. ఆయన మా కుంటుబీకుల నుండి అంతా లాక్కున్నారు. మా నాయనమ్మ ఆయన చెల్లెలు కూతురు. 'మామయ్యా నాకున్న ఆస్తిపాస్తులన్నీ తీసుకో.. నా బిడ్డను మాత్రం ప్రాణాలతో వదిలెయ్యి మామయ్యా' అంటూ మా నాయనమ్మ పలుమార్లు ఆయనను ప్రాధేయ పడింది. మీర్జా ఇలాహీ బక్ష్ మా నాన్నను చంపేస్తారేమోనన్న భయంతో ఆయన్ను అక్కడ-ఇక్కడ దాచి పెట్టేందుకు ఆమె ఎంతో కష్టపడింది. అల్లాహ్‌ ఆయన ప్రాణాలు కాపాడాడు.

238