పుట:1857 ముస్లింలు.pdf/240

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిత్యాగాలొకరివి-భోగాలొకరివి

1857 సెపెంబరు 12 రాత్రి ఆంగ్లేయుల మీద దాడికి చక్రవర్తి ఢల్లీ నగరం వెలుపలకు వస్తున్నారని, కనుక హిందూ-ముస్లిం యోధులంతా కదలి రావాల్సిం దిగా ప్రకటించారు. ఆ ప్రకటన విని ఉత్సాహభరితులైన ప్రజలు, సైనికులు అందిన ఆయుధానల్లా తీసుకుని చక్రవర్తి నాయకత్వంలో ఆంగ్ల సైన్యాల మీద విరుచుకపడ్డానికి సిద్ధమై కాశ్మీర్‌ గేటు వద్ద 70 వేలకు పైగా గుమికూడారు. ఈ పోరాటానికి స్వయంగా చక్రవర్తి సారథ్యం వహించటమే కాకుండా ఆయన యుద్ధభూమికి వస్తున్నారనడంతో ప్రజలు-సైనికులలో ఉత్సాహం పెల్లుబికింది. అమితోత్సాహంతో శత్రువు మీద దాడిచేయడానికి చక్రవర్తి అనుమతి కోసం ఎదురు చూడసాగారు. (The Great Mutiny, Christopher Hibbert,

1857 ముస్లింలు.pdf

రంగూన్‌లో జఫర్‌ సమాధి వద్ద నిర్మించ తలపెట్టిన స్మారక భవన నమూనా

Penguin Books, New Delhi, 1978, Pp. 313-314)

ఆ సమయంలో నిర్ణాయాత్మకమైన ఆ యుద్ధం జరిగి ఉంటే ఆంగ్లేయులకు పరాజయం తప్పేది కాదు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ఆంగ్లేయుల తొత్తులు తక్షణమే రంగప్రవేశం చేశారు. ప్రమాదఘంటికలు మోగించారు. ముంచుకొస్తున్న ప్రమాదం వివరాలను ఆంగ్లేయాధికారులకు చేరవేశారు. మరోవైపు న బహదాూర్‌ షా జఫర్‌ చెంతచేరి ఆంగ్లేయలు శక్తిసామర్ధ్యాలను, బలసంపన్నతను అతిగా చూపి, తిరుగుబాటు యోధుల, ప్రజల బహీనతలను ఆయనకు పదేపదే విన్పించసాగారు. తాడోపేడో తేల్చుకునేందుకు

237