పుట:1857 ముస్లింలు.pdf/234

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


త్యాగాలొకరివి-భోగాలొకరివి

ఆంగ్లేయులు శత్రు శేషం పట్ల చాలా జాగ్రతలు తీసుకున్నారు. అన్ని రకాలుగా తమ అడుగులకు మడుగులొత్తే వ్యజ్కక్తులను మాత్రమే తాము హస్తగతం చేసు కున్న రాజ్యాలకు అధిపతులు చేశారు. పరాజితుల వారసులు ఆత్మగౌరవం గలవారుగా భావించినా, భవిష్యత్తులో ఆ వారసుల నుండి ప్రమాదం రాగలదని అనుమానించినా అటువంటి వారిని స్వజనం నుండి, స్వంత ప్రజల నుండి, స్వంతగడ్డ నుండి బహుదూరంగా పంప వేయడం బ్రిటిషర్ల అనుసరించిన రాజనీతి.

ఈ రాజనీతిలో భాగంగానే మైసూరు పులి టిపూ సుల్తాన్‌ను 1799లో శ్రీరంగపట్నం యుద్ధంలో పరాజితుడ్ని చేయగానే ఆయన స్థానంలో గతంలోలా ఆయన

1857 ముస్లింలు.pdf

లక్నోలోని బేగం హజరత్‌ మహల్‌ స్మారక పార్క్‌

వారసులను కాకుండా రాజా వడయార్‌ వారసులను గద్దె మీద కూర్చొబెట్టారు. ఆ తరువాత కొంత కాలం తరువాత అక్కడ నుండి మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతం పరిధిలో గల చరిత్ర ప్రసద్ధి చెందిన వెల్లూరు (Vellore) కోటకు టిపూ వారసులను తరలించారు.

1806 సంవత్సరం జూలై 9న టిపూ సుల్తాన్‌ కుమార్తె పెళ్ళి సందర్భాన్ని పురస్క రించుకుని వెల్లూరు కోటలో సుమారు 1500 మంది స్వదేశీ సెనికులు తిరుగుబాటు చేసి మూడు వందల మంది ఆంగ్ల సైనికులను మట్టుబెట్టారు . ఆ వెంటనే టిపూ కుమారుడు ఫతే హెదరను తమ రాజుగా ప్రకటించారు.ఈ సందర్బంగా అమితోత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. ఆ సంబరాలలో మునిగి తేలుతున్నతిరుగుబాటు యోధులు భద్రత

231