పుట:1857 ముస్లింలు.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్యాగాలొకరివి-భోగాలొకరివి

రూపాయల బహుమతి కూడా ప్రకటించాల్సి వచ్చింది. అంత మొత్తంలో బహుమతులు ప్రకటించిన ఆ యోధుడ్ని బంధించటం ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనికాధికారులకు చివరి వరకు సాధ్యం కాలేదు.

1857 సెపంబరు మాసంలో ఢల్లీ పతనమైంది. లక్నో ఆంగ్లేయుల చేత చిక్కింది. రోహిల్లా వీరులు ఉరితీబడ్డారు. నమ్మక ద్రోహంవల్ల మౌల్వీ అహ్మదుల్లా షా హత్యకు గురయ్యారు. నానా సాహెబ్‌, బేగం హజరత్‌ హహల్‌, అజీముల్లా ఖాన్‌ లాంటి స్వాతంత్య్ర సంగ్రామ యోధులు అడవుల పాలయ్యారు. ఈ ప్రతికూల పరిస్థితులు ఫిరోజ్‌ షా కు నిరాశ కల్గించలేదు. ఆయన సిరోంజ్‌ అడవుల్లో తలదాచుకుని మళ్ళీ పోరుకు తయారు

ఆవశాన దాశలో షెహజాదా ఫిరోజ్‌షా

కాసాగారు. ఆ సందర్భంగా బ్రిటిష్‌ మహారాణి విక్టోరియా చేసిన ప్రకటనను దృష్టిలో ఉంచుకుని పోరాటాన్ని విరమించడం ఉత్తమమని కొందరు హితవు పలికారు. ఆగ్రాకు చెందిన డాక్టర్‌ నజీర్‌ఖాన్‌ షెహజాదా ఫిరోజ్‌ షా తరుపున ఈ విషయమై మధ్యవర్తిగా వ్యవహరించాడు. 1859 జూన్‌ 4న విక్టోరియా రాణి ప్రతినిధికి ఫిరోజ్‌ షా తరపున లేఖ పంపారు.

ఒకవపు సంప్రదింపులు జరుపుతూ మరోవెపు బ్రిటిష్‌ గూఢచారుల కళ్ళుగప్పి ఇండియా నుండి అదృశ్యమైన ఫరోజ్‌ షా బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాగుతున్నపోరాటానికి మధ్య ఆసియా, పశ్చిమ దేశాల అధినేతల సహకారం కోరుతూ పర్య టనలు గావించారు.

229