పుట:1857 ముస్లింలు.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రులకు, ఈ గ్రంథం చిత్తుప్రతిని చదివి, పలు సూచనలు చేసిన ప్రముఖ పాత్రికేయులు అబ్దుల్‌ వాహెద్‌ గారికి (గీటురాయి-హైదరాబాద్‌), ప్రూఫ్‌ రీడింగ్‌లో సహకరించిన ముహమ్మద్‌ అబ్దుల్‌ మతీన్‌ ఉమ్రి గారికి (గీటురాయి-హైదరాబాద్‌), ముఖచిత్రాన్ని అందంగా డిజైన్‌ చేసిన ప్రముఖ చిత్రకారులు అబ్దుల్లా గారికి (విజయవాడ), పుస్తకాన్ని సెట్‌ చేసిన లంకా లక్ష్మీనారాయణ (గీటురాయి-హైదరాబాద్‌) గారికి, నా ప్రతి ప్రయత్నాన్ని తన ఆశీస్సులతో బలం చేకూర్చిన మా అమ్మ సయ్యద్‌ బీబిజాన్‌కు, అన్ని సమయాలలో నన్ను ప్రోత్సహిస్తు, నా రచనా వ్యాసంగానికి ఏ విధమైన అటంకం కలుగకుండా తోడ్పాటునందిస్తున్న నా జీవిత సహచరిణి షేక్‌ రమిజా బానుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఈ గ్రంథానికి రచయితను నేనైనా, సమాచార సేకరణ వద్ద నుండి, ఆ సమాచారం పుస్తకం రూపం తీసుకొని పాఠకులకు చేరేవరకు సాగిన ఈ నా ప్రయత్నంలో పైన పేర్కొన్న ప్రముఖులు, సన్నిహితులు, మిత్రులు ప్రత్యక్షంగా సహకరించినా, పరోక్షంగా చేయూత నిచ్చినవారు కూడా పలువురున్నారు. ఆ కారణంగా ఈ గ్రంథం 'వ్యష్టికృషి' గా నేను భావించటం లేదు; 'సమష్టికృషి' ఫలితమని గట్టిగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా నా కృషిలో అన్ని విధాల చేయూతనివ్వడమే కాకుండా, చక్కని సలహాలు- సూచనలనూ అందించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
భారత దేశంలోని అన్ని సాంఘిక జనసముదాయాలు సదవగాహనతో, సద్భావనతో, సామరస్య వాతావరణంలో, అన్ని రకాల అసమానతలను తొలగించుకుని, శాంతియుతంగా గౌరవప్రదమైన జీవితాలను సాగించాలన్నది నా ఆకాంక్ష. ఈ ఆశయ సాధన దిశగా నేను ఎన్నుకున్న రంగంలో రచయితగా నా అతి చిన్న ప్రయత్నానికి చేయూతనిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈ గ్రంథాన్ని చదివిన పాఠ మిత్రుల నుండి మార్పులు-చేర్పులు, సూచనలు-సలహాలను, తప్పొప్పులను వినమ్రంగా ఆహ్వానిస్తున్నాను.