ఈ పుట ఆమోదించబడ్డది
అధ్యాయం - 8
- త్యాగాలొకరివి-భోగాలొకరివి
అది 2002 ఏప్రిల్ 21వ తేది. ఆంధ్రాప్రదేశ్ రాష్ట్రం, కృష్ణ్జా జిల్లాలోని పరిటాల గ్రామానికి చెందిన షేక్ మౌలా సాహెబ్‌ను పలకరించడానికి వెళ్ళాను. 1947లో చివర్ల్లో అంటే 55 సంవత్సరాల క్రితం నిజాం సంస్థానంలో భాగమైన పరిటాల గ్రామం నిజాం సంస్థానం నుండి వేరుపడి స్వతంత్ర రిపబ్లిక్‌ను ప్రకటించుకుంది. ఆవిధంగా సంచలనం సృషించిన గ్రామం బిడ్డడు షేక్ మౌలా సాహెబ్. అప్పుడు మౌలా వయస్సు సుమారు 22 సంవత్సరాలు.
జాతీయ ఆలోచనలు వ్యక్తం చేయటమే మహా నేరంగా పరిగణిస్తున్న కాలంలో పరిటాలలో పరిటాల రిపబ్లిక్ పతాకం ఎగురవేసిన యువకుడు మౌలా సాహెబ్ రిపబ్లిక్ యోధులను ఉత్సాహపరుస్తూ గతంలో పాడుతూ వచ్చిన ఈ క్రింది పాటను పాడడారు. 'దూర్ హటో దునియా వాలో హిందూస్థాన్ హమారాహై .................................... షురూహువాహై జంగ్ హమారా
225