పుట:1857 ముస్లింలు.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

Hibbert పలు గ్రంథాలను, నివేదికలను ఉటంకింస్తూ తన The Great Mutiny లో పేర్కొన్నాడు.

ఉరిశిక్షప్రకటించిన తరువాత ఒక్కొక్కరినీ ఉరితీయటం కాకుండా జట్లు జట్లుగా యోధులను సామూహిక ఉరికి బలివ్వడం ఆంగ్లేయులు అనుసరించిన మరొక ప్రత్యే కత పద్ధతి. ఒక జట్టులోని యోధు లను వివిధపద్ధతు లలో ఉరిశిక్షల ద్వారా ప్రాణాలు హరిసూ,ఆ దృశ్యాలను ఆ తరువాతి జట్టు చూచేలా ప్రత్యే క ఏర్పాట్లు చేయడం, ఎవరైనా ఆ భయానక దృశ్యాలను చూడకుండాఇష్టం లేక ముఖం తిప్పుకుంటే వారిని బాయనెట్ లతో పొడిచి మరీ ఉరితీతలను చూసేలా చేసి ఆంగ్లేయ సౖౖెనికులు ఆనందించారు. ప్రాణాలు హరించే తంతును చూసి తిరుగుబాటుదారులలో ఎవ్వరైనా ఉద్వేగానికి లోనై ఆక్రందన చేస్తే, ఆంగ్ల సైనికులతోపాటుగా, సైనికాధికాధికారులు కూడా మరింతగా సంతోషాన్ని వ్యక్తంచేస్తూ ఆనందించారు.

ఈ దృశ్యాలను చూసి ఆనందించేందుకు ఆంగ్లేయాధికారులు తమ కుటుంబీకు లను కూడా ఉరితీతల వేదికల వద్దకు తీసుకవచ్చి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి తమ ఘాతుకాలను ఘనకార్యాలుగా చూపించారు. అల్పాహారాన్నితీసుకుంటూ, విలాసంగా సిగార్లు తాగుతూ ఆంగ్లేయ మహిళలు కూడా ఆ దృశ్యాలను చూసికేరింతలతో సంబరపడ్డారు . ఆ దృశ్యాలను చూడాలని మహిళలు కళ్ళుమూసుకుని తిరుగుబాటు యోధు ల ఆక్రందనలను విని సంతసంచేవారని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. డిల్లీలోని చాంద్‌నీ చౌక్‌ వద్ద పెద్ద సంఖ్యలో సాగిన ఈ ఉరితీతలను తిలకించడానికి వచ్చేవారు తాపీగా కూర్చోడానికి కూడా తగిన ఏర్పాట్లు చేసన సందర్భాలున్నాయని Christopher Hibbert, Charles Ball, Moinuddin Hasan లు పేర్కొన్నారు.

గ్రామాలలోని తిరుగుబాటు యోధుల కుటుంబీకులను కూడా ఉరివేదికల వద్దకు బలవంతంగా ఈడ్చుకొచ్చి తమ తండ్రులు, అన్నా-తమ్ముళ్ళు, బిడ్దల కంఠాలకు ఉరితాళ్ళు గట్టిగా బిగుసుకుంటుండగా వారు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదాులుతున్న భయానక దృశ్యాలను బలవంతంగా చూపించడం జరిగింది. కళ్ళ ఎదురుగా తమ ఆత్మీయులు ప్రాణాలు కొల్పోతుంటే, గుండెలు పగిలేలా వారు రోదిస్తుంటే ఆంగ్ల సైనికులు, అధికారులు పగలబడి నవ్వుతూ ఆనందించేవారని ఆంగ్లేయ చరిత్రకారులు స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంగ్ల సైనికులు, ఆంగ్లేయాధికారులు

218