పుట:1857 ముస్లింలు.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం


ఉరికంబాలుగా వాడుకున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉరి వేదికల మీద మాత్రమే కాకుండా తిరుబాటు యోధులను ఎండ్ల బండ్ల మీద నిల్చోబెట్టి, ఉరితాడును బిగించి అకస్మాత్తుగా ఎడ్లను ముందుకు అదిలించి కాళ్ళ క్రింద బండిని లాగి వేయటం ద్వారా ఉరి బిగుసుకుపోవడం తద్వారా ప్రాణాలు హరించటం ఒక రకం.

ఎడ్ల బండ్లను వాడటం మాత్రమే కాకుండ కొన్ని ప్రాంతాలలో ఏనుగులను రప్పంచి తమదైన పద్ధతిలో నేరస్తు లుగా నిర్ధారించిబడిన స్వదేశీ యోధు లను ఆ ఏనుగుల మీద కూర్చోబెట్టి ఉరితాడు బిగించి ఉరిశిక్షలు విధించటం మరోరకం. ఈ పద్ధతిలో స్వదేశీ యోధుల మెడలను వంచి ఉరితాడు తగిలించి, ఆ తరువాత భయానకంగా అరుస్తూ ఏనుగులను అదిలించి పరుగులెత్తించడంతో తిరుగుబాటు యోధుల కంఠాలకు బిగించిన ఉరితాడు మరింత బిగుసుక పోవటం ద్వారా ప్రాణాలను తీశారు.

ఈ పద్ధతులు అత్యవసర పద్ధతులుగా ఆంగ్లేయులు చెప్పుకోగా ఉరి వేదికల మీద కాకుండా చెట్లను కూడా ఉరివేదికలుగా వాడుకుని ఉరిశిక్షలు విధించారు. ఈ రకంగా ఢిల్లీ నగర పరిసరాల్లో మాత్రమే కాకుండాతిరుగుబాటు జరిగిన ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో వేలాదిగా యోధులు చెట్లకు వేలాడుతూ ప్రాణాలు కోల్పోయారు. గ్రామాలలో కన్పించిన ప్రతి చెట్టును తిరుగుబాటు వీరులను ఉరితీసేందుకు ఉపయోగించారు. ఈ విధంగా సాగిన ఉరిశిక్షల అమలుకు అనుసరించిన పద్ధతులను చరిత్రకారుడు Charles Ball తన గ్రంథాం History of Indian Mutiny లో చాలా వివరంగా పేర్కొన్నాడు.

ఉరితీతలకు గురవుతున్న యోధులతో ఆంగ్ల సైనికులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. ఉరితీత నిర్ణయ మైన యోధు లను శిక్ష అమలుకు ముందు బాయెనెట్ లో పొడిచి పొడిచి హింసించారు. ఆ యోధుల దేహాల నుండి రక్తం స్రవిస్తూంటే రక్తం రుచి మరిగిన పులుల్లా ఆనందం వ్యకంచేశారు. ఆ యోధు ల జుట్టు పట్టుకుని వెంట్రుకలను బలవంతంగా ఊడబెరికారు. గడ్డాలను పట్టుకుని బరబరా ఈడ్చుతూ, గిరగిరా తిప్పుతుండగా, ఆ భాధకు తట్టుకోలేక విలవిలలాడి పోతున్న బాధితుల చుట్టూచేరి కేరింతలు కొడుతూ ఆనందించారు. ఈ చిత్రహింసలను భరించలేక తమను త్వరితగతంగా ఉరితీయమని స్వదేశీసైనికులు అభ్యర్థిస్తూన్నా ఆంగ్ల సైనికులు తమకు సంతోషాన్నికలిగించే హత్యాకాండను చాలా తాపీగా సాగించేవారని Christopher

217