పుట:1857 ముస్లింలు.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం


Books, India, 1980 P. 318) ఈ విధంగా ముస్లింలను తమ ప్రధాన శత్రువులుగా భావించిన ఆంగ్లేయులు ఈ గడ్డ మీద నుండి ముస్లింలను బౌతికంగా రూపుమాపటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అన్నివిధాలా బలహీనపర్చాలని ఆలోచనలు సాగించారు. ఆ మేరకు పలు పథకాలను రూపొందించారు. శతవిధాలుగా ప్రయత్నించారు. (Rise of Muslims in Indian Politics, P.7)

ముస్లింలు 'గర్విష్టులు..క్రూరులు'

బెంగాల్‌ సివిల్‌ సర్వీసెస్‌లో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించిన Henry Harrington Thomas ముస్లింలకు వ్యతిరేకంగా చాలా తీవ్రమైన అభిప్రాయాలను వ్యకంచేశాడు. ఆనాడు ఆంగ్లేయాధికారులలో ముస్లిం మీద ఉన్నఅంతటి కసీ ద్వేషానికి కారణం ఏంటో, ముస్లిం పట్ల ఉన్న వ్యతిరేకత స్థాయి ఏపాటిదో అర్థం చేసుకునేందుకు హెన్రీ హ్యారింగ్ టన్‌ థామస్‌ వెల్లడంచిన అభిప్రాయాలు చాలా వరకు ఉపయాగపడ్తాయి.

1858Ö’ Henry Harrington Thomas 'Late Rebellion in India an Our Future Policy' అను శీర్షికతో ఒక కరపత్రం రాశాడు. ఆ కరపత్రంలో ప్రథమ ఖలీఫా నుండి ప్రస్తుత ముస్లింల వరకు అంతా గర్విష్టులు, అసహనపరులు మరియు క్రూరులు. ఏ మార్గం ద్వారానైనా ఆధిపత్యం లక్ష్యంగా మహ్మదీయులు పనిచేస్తారు. క్రైస్తవుల పట్ల నిరంతరం విద్వేషాన్ని ప్రోత్సహిస్తుంటారు. పర మతస్థుల పాలనలో వారెప్పుడూ కూడా మంచి పౌరులుగా మసలుకోలేరు అంటూ ముస్లింల పట్ల తన విద్వేషాన్ని వెల్లగ్రక్కాడు.

ఆంగ్లేయులలో ముస్లింలకు వ్యతిరేకంగా స్థిరీకరించబడిన అభిప్రాయాల మూలంగా తిరుగుబాటు యోధులతోపాటుగా తిరుగుబాటులో పాల్గొనకున్నా, తిరుగుబాటుకు సహకరించకున్నా, అసలు తిరుగుబాటు గురించి ఏమాత్రం తెలియకున్నా కూడ గ్రామాలలో నివసిస్తున్నముస్లింలు ఇతర ప్రజలతోపాటుగా పెద్ద సంఖ్యలో ఆంగ్ల సైన్యాల దుర్మార్గాలకు బలయ్యారు.

మహాకవి గాలిబ్‌ రాసిన లేఖలలోనూ , ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారి Moinuddin Hasan రాసిన తన గ్రంథం Gadar 1857లోనూ, తిరుగుబాటు

213