పుట:1857 ముస్లింలు.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఆంగ్లేయాధికారులకు ఆనవాయితీగా మారింది.

(An English officer had made it a principle to treat every Muslim as a rebel. He would enquire from every one he saw, If he was a Hindu or a Muslim, and would shoot him dead right there if he turned out to be a Muslim’ - Quoted in S. Abul Hasan Ali Nadwi, Muslims in India, P. 110)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో స్వయంగా పాల్గొన్న ఆంగ్లేయాధికారి లార్డ్‌ రాబర్ట్స్ (Lord Roberts) తన చెల్లెలు Harriet కు లేఖ రాస్తూ ఆ లేఖలో తిరుగుబాటు యోధులను ఫిరంగులకు కట్టీ కాల్చి వేసిన దాృశ్యాలను వివరించాడు. తిరుగుబాటు దారుల పట్ల, ప్రధానంగా ముస్లింల పట్ల ఆంగ్ల సైన్యాలు సాగించిన పైశాచికకాండను పూర్తిగా సమర్థించుకుంటూ, ముస్లింల పట్ల అతనిలోనున్న కసీ, ద్వేషాలను వ్యక్తం చేశాడు. అటువంటి ఒక లేఖలో భగవంతుని దయవలన ఆంగ్లేయులు భారతదేశానికి ఇంకా యజమానులేనన్న విషయాన్నిధూర్తులైన ముస్లింలకు తెలియచేయటం తమ ఉద్దేశ్యమని పేర్కొన్నాడు.

(‘The Death that seems to have the greatest effect is being blown from a gun. It is rather a horrible sight, but in these times, we can not be particular.’ The purpose of this ‘business’ was to show ‘these rascally Musalmans that, with Gold’s Help, English will still be the masters of India’ - Rise of Muslims In Indian Politics, Rafiq Zakaria, Somaiya Publications, New Delhi, 1986, P. 7)

బ్రిటిష్‌ అధికారులు తమ సంబంధీకులకు రాసిన లేఖలలో అంతటి క్రూరత్వాన్ని వ్యక్తంచేశారంటే నిజంగా తిరుగుబాటుదారులతో వారు ఇంకా ఎంత రాక్షసంగా వ్యవహరించి ఉంటారో మనం ఊహించవచ్చు. ఆనాడు ఆంగ్లేయులకు ముస్లింల మీద కసీ, ద్వేషం ఎంతగా పెచ్చరిల్లిందంటే, ముస్లింల మత మనోభావాలకు తీవ్ర విఘాతం కల్గిస్తూ వారిని హేళన చేస్తూ మానసికంగా మరింత క్షోభకు గురి చేసేందుకు కడు నీచమై న చర్య లకు కూడా పాల్పడ్డారు . పట్టుబడిన ప్రతి ముస్లింను అవమానకర పద్ధతు లలో అంతం చేశారు. వారి మత మనోభావాలకు తీవ్రమైన విఘాతం కలిగేలా ప్రవర్తించారు. పట్టుబడిన ముస్లింలను బ్రతికుండగానే పంది తోలుకు కుట్టారు. పంది మాసం వాళ్ళ నోళ్ళల్లో కుక్కారు...గాయపడన ఖైదీలను బతికి ఉండగానే కాల్చేశారు. (భారత స్వాతంత్య్ర

210