పుట:1857 ముస్లింలు.pdf/212

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం


ఆస్తులను కొల్లగొట్టడం, మాత్రమే. (భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర, ప్రచురణ కృష్ణా జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల సంఘం, విజయవాడ, 1984. పేజీ. 24) ఆనాడు వివిధ స్థాయిలలో తిరుగుబాటులో పాల్గొన్న వారి మీద దేశమంతా పలు ప్రాంతాలలో పలు ఆరోపణలను మోపి కంపెనీ పాలకులు వివిధ దుర్మార్గపు చర్యలను తీసుకున్నారు. ప్రజల ఆస్తులను జప్తు చేశారు. తిరుగుబాటుకు సహకరించిన, తిరుగుబాటులో పాల్గొన్న వారి కుటుంబీకులను చెరబట్టారు. ఆ కుటుంబీకుల ఆస్తిపాస్తులను ధ్వంసం చేశారు. గృహాలను కూలగొట్టి వారిని నిరాశ్రయులను చేశారు. స్వస్థలాల నుండి తరిమికొట్టారు. ప్రజలను మూక్ముడిగా నిర్బధించి అప్పటికప్పుడు విచారణలుపూర్తి చేసి బహిరంగంగా కఠిన శిక్షలు విధించారు. ఆ శిక్షలను భయానక చిత్రహంసలు పెడుతూ బహిరంగంగా అమలు చేశారు.

ముస్లింల పట్ల రగిలిన విద్వేషాగ్ని

అజేయులమన్నఅహంకారంతో అంతులేని అధికారాన్ని, స్వదేశీయుల మీద హద్దులు దాటిన ఆధిపత్యాన్ని సాగిస్తున్నఆంగ్లేయులకు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ వీరులు పెద్ద సవాలు విసిరారు. ఈ సవాలుతో ఆంగ్లేయులు ముస్లింల మీద పూర్తిగా పేట్రేగి పోయారు. ఈ తిరుగుబాటుకు ప్రధాన ప్రేరణశక్తి ముస్లింలని స్థిరాభిప్రాయానికి వచ్చిన కంపెనీ సైనికులు, అధికారులు ప్రతీకార జ్వాలతో రగిలిపోయారు. ఈ సందర్బంగా హిందూ-ముస్లిం ఉమ్మడి వారసత్వాన్ని విచ్ఛినం చేయాలన్నదుష్ట సంకల్పంతో ఆంగ్లేయులు వ్యవహరించడం వలన ఈ ప్రతికార జ్వాలలకు ప్రధానంగా ముస్లిం ప్రజానీకం బలయ్యింది. ప్రజల మీద విరుచుకుపడ్డ ఆంగ్లేయులు ఈ సందర్భంగా తమ సన్నిహితులుకు రాసుకున్న లేఖలలో, ఉన్నతాధికారులకు పంపుకున్న నివేదికలలో ముస్లిం యోధుల పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆనాటి వారి మనస్థితిని వెల్లడి చేస్తుంది.

ప్రతి ముస్లింను ఆంగ్లేయాధికారులు తిరుగుబాటుదారునిగా పరిగణించారు. తమ దారిలో ఎదురుపడ్డ ప్రతి ఒక్కరిని నిర్బంధించటం, ఆ వ్యక్తి హిందువా? లేక ముస్లిమా? అని ప్రశ్నించటం-విచారించటం, ఆ అభాగ్యుడు కనుక ముస్లిం అయినట్టయితే ఎటువంటి ప్రాధామిక విచారణ కూడా లేకుండా అక్కడికక్కడే ఆ క్షణాన్నే కాల్చి చంపడం

209