పుట:1857 ముస్లింలు.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంగ్లేయుల రాక్షసత్వం

1858 మే 25న న్యూయార్క్‌ డైలీట్రిబ్యూన్‌లో ఫ్రెడ్రిక్‌ ఏంగెల్స్‌ రాసిన వ్యాసంలో అసలు విషయం మేమిటంటే, ఇంతటి పశుప్రాయ మైన సైన్యం ఒక్క బ్రిటన్‌లో తప్ప యూరపలోగాని, అమెరికాలోగాని మరెక్కాడా లేదు. దోపిడీ, అత్యాచారం, ఊచకోత-ఈ ఘోరాలు ఇతరత్రా పూర్తిగా స్వస్తి చెప్పి నప్పటికీ-ఇవి మాత్రం బ్రిటిష్‌ సైన్యానికి అశ్రుతంగా సంక్రమిస్తూన్నప్రత్యేక సౌకర్యాలూ, సహజమైన హక్కులే...ఇకపోతే మధ్యయుగాల నాటి ఆనవాయితీ ప్రకారంగా దాడి చేసి స్వాధీన పర్చుకున్న నగరాన్ని కొల్లగొట్టే హక్కు ఇతరత్రా అన్నిదేశాల్లో నిషేధించబడినప్పటికీ, బ్రిటిష్‌ సైన్యంలో మాత్రం నేటికీ నియమం తప్పకుండా యుధావిధిగా అమలు జరుపబడుతోంది, అని పేర్కొన్నాడు.

ఉరికంబాలు చాలక వృక్షాలకు ఉరితాళ్ళను కట్టి తిరగబడిన ప్రజలను ఉరితీస్తున్న దృశ్యం

(ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామం,1857-1859, మార్క్స్‌-ఏంగెల్స్‌, ప్రగతి ప్రచురణాలం, మాస్కో, 1857 -1859, పేజి.166)

సంపన్నులు - సామాన్యులు అని కాకుండా గృహాలలో జొరబడి స్వయంగా దోపిడికి పాల్పడుతున్న అధికారులలో ఇరువురు ప్రజల చేతిలో హత్యకు కూడా గురయ్యారు. ఆంగ్ల సైనికులు స్వైరవిహారం చేస్తున్న సందర్భంలో ఆంగ్లేయాధికారులకు వీసమెత్తు నష్టం కల్గించినా ఎదురయ్యే భయానక పరిస్థితుల గురించి తెలిసి ఉండి కూడా అధికారుల హత్యకు ప్రజలు సిద్ధమయ్యారంటే, ఆ అధికారుల పట్ల వారెంతగా

207