పుట:1857 ముస్లింలు.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

Martin Montgomey తన గ్రంథం The Indian Empire లో పలు నివేదికలను, గ్రంథాలను ఉటంకిస్తూ సవిరంగా పేర్కొన్నాడు.

యధేచ్ఛగా సాగిన విద్వంసం-దోపిడి

ఆంగ్లేయాధికారులు స్వయంగా బయలుదేరి నగరంలోని సంపన్నుల గృహాలను గుర్తించి మరీ ఆ గృహాలలోకి జొరబడి దోచుకున్నారు. నగరం వదలి వెళ్ళిన నగర ప్రముఖుల, సంపన్నుల గృహాలలో దాచి పెట్టబడిన సంపదను వెలికి తీయడానికి ప్రత్యేకంగా శిక్షణ పొందిన వ్యక్తుల బృందాలను కూడ ఆంగ్లేయాధికారులు ఉపయాగించారు. ఆ నిపుణుల సహాయంతో నగరంలోని భవంతులన్నిటిని కూలగొట్టారు . భవనాల నేలను పూర్తిగా తవ్వివేసి నేలమాగళిని సైతం పెళ్ళగించారు.

అంతటితో సరిపెట్టుకోకుండా తమ ప్రమేయం లేకుండ 'ప్రైజ్‌ ఏజంట్స్' అను ప్రత్యేక వ్యక్తులను కూడ ఆంగ్లేయులు నియమించారు. ఈ ప్రైజ్‌ ఏజంట్స్ కంపెనీ బలగాల సహాయంతో నగరంలో స్వైరవిహారం చేశారు. ఆంగ్ల సైనికుల కంటే భయానకంగా వ్యవహరిస్తూ సంపన్నులను, సామాన్యులను హింసించి, తుపాకులతో అదిలించి, చంపేస్తామని బెదిరించి మరీ గుప్త సంపదను వెలికి తీయించారు.

ఆ సమయంలో తిరుగుబాటు యోధులతో యుద్ధం చేయటం కంటే ప్రజల మీదావిజృంభిస్తూ అమానవీయ చర్యలకు పాల్పడుతున్న సైనికులను నిరోధించటం ఆంగ్లేయాధికారులకు కష్టతరమైంది. పలు విద్వంసకర చర్యలకు పాల్పడుతున్న ఆంగ్లసైన్యాలను ఆపేందుకు ప్రత్యేకంగా గస్తీ దాళాలను కూడానియమించాల్సి వచ్చింది. స్వంత సైనికుల స్వైరవిహారాన్ని ఆపేందుకు మరింత ముందుకు వెళ్ళి విధులలో లేని సైనికులు సైనిక స్థావరాలలో మాత్రమే ఉండాలని, అలా కాకుండా బయట నగరంలో ఎక్కడ కన్పించినా వారిని తీవ్రంగా శిక్షించటం మాత్రమే కాదు ఉరిశిక్షలు కూడా తప్పవని తీవ్రంగా హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాలు పురోగమించే కొద్దీ ప్రతిచోట దోపిడీ, వినాశకర కార్యాలు ముమ్మరంగా సాగాయని 1857నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గురించి వ్యాసాలు రాసిన ఫెడ్రిక్‌ ఏంగెల్స్‌ కూడ వివరించాడు. ఈ విధ్వంసకర చర్యలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు, సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా సాగడంతో,

206