పుట:1857 ముస్లింలు.pdf/208

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం

tion. We marched in silence or involuntarily spoke in whispers, as though fearing to disturb those ghastly remains of humanity. The sights we encountered were horrible and sickening to the last degree. Here dog gnawed at an uncovered limb, there a vulture disturbed by our approach from its loathsome meal, but too completely gorged to fly, fluttered away to a safer distance. In many instances, the positions of the dead bodies were appallingly life-like. Some with their arms uplifted as if beckoning, and, indeed, the whole scene wired and terrible beyond description. Our horses seemed to feel the terror of it as much as we did, for they shook and snorted in evident terror. The atmosphere was unimaginably disgusting, laden as it was with the most noxious and sickening odors. (Muslims in India: S. Abul Hasan Ali Nadwi, P. 109)

పండిత ప్రముఖులు, సంపన్నులు నివసించే కచ్చా చలాన్‌ ప్రాంతంలో జరిగిన దారుణాలు వర్ణించనలవి కావు. ఆంగ్ల సైనికులు రోజుల తరబడి సాగించిన కిరాతకాలతో తమ రాక్షస దాహం తీరక ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖులతోపాటుగా మరో 14 వందల మంది స్త్రీ-పురుషులను రాజ్‌ఘాట్ వద్దకు తీసుకునిపోయి సామూహికంగా కాల్చి చంపారు. ఆ మృతదేహాలను యమునా నదిలో విసిరేశారు. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టి న ఆడపడుగులు కచ్చా చలాన్‌లోని బావులలో దూకి ప్రాణత్యాగాలు చేశారు. ఈ విషాదాంలో పిల్లలు, పెద్దలు అను తేడా లేకుండా పోయింది. ఈ విధంగా ఏర్పడిన శవాల గుట్టల విషాదాలన్నిటిని స్వయంగా చూసిన మహాకవి గాలిబ్‌ తన దాస్తాన్‌-యే-గదర్‌ గ్రంథంలో పేర్కొంటూ ఏమని రాయను ? ఎన్నని రాయను? నా కలం ఇంకా రాయలేకపోతుంది అంటూ విలవిల్లాడారు.

ఆంగ్లేయ సైనికుల చేతుల్లో హతమైన స్త్రీ-పురుషుల వివరాలు పూర్తిగా లేవు. ఆంగ్ల సేనల అరాచకాలకు తట్టుకోలేక నగరవాసులు చాలా మంది నగరం వదిలి వెళ్ళి పోయారు. ఆ విధంగా వెడు తున్నవార్ని కూడా వదల కుండా వెంటాడి మరీ వధించారు. నగరం నుండి బయటపడే వీలు లేక ఉండిపోయిన మహిళల మీద ఆఘాయిత్యాల నుండి, ఆంగ్లేయుల రాక్షసత్వం నుండి తమ్ముతాము కాపాడుకునేందుకు మహిళలు ఆత్మాహుతికి పాల్పడ్డారు . స్యయంగా తమనుతాము తగులబెట్టుకున్నారు. ఈ విషయాలను

205