పుట:1857 ముస్లింలు.pdf/207

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

Mutiny లో రచయిత Christopher Hibbert పలు చోట్ల ఉటంకించాడు.

ఈ విధంగా ఒక్క ఢిల్లీలో మాత్రమే సాగలేదు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఎదురు నిలబడిన ప్రతి వ్యక్తి, ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో ఇటువంటి దుర్మార్గాలు జరిగాయి. మేము అన్నిచోట్లాపడ్డాం. ఎదురు తిరిగేవారిలా ఏమాత్రం కన్పించినా స్థానికులను నరికేశాం. ఈట్రిప్పులను మేము బాగా ఎంజాయ్‌చేశాం అని ఆనాట్ సంఘటనలలో పాల్గొన్న ఆంగ్ల సైనికులు తమ కుటుంబీకులకు ఇక్కడి సంగతులు తెలుపుతూ రాసిన లేఖలలో పేర్కొన్నారని Indian Mutiny గ్రంథంలో Charles Ball ఆ వివరాలను పలుచోట్ల వివరించాడు.

శవాల దిబ్బగా మారిన ఢిల్లీ

ఢిల్లీ నగరవాసుల మీద ఆంగ్ల సైన్యాలు సాగించిన పైశాచిక దమనకాండ వలన నగరవాసులలో అత్యధికులు నిహతులయ్యారు. నగరంలో అతి భయానకంగా సాగిన హత్యాకాండ ఫలితంగా ఢిల్లీ నగరంలో ఏమూల చూసినా, ఏ వీధిలో చూసినా శవాలతో నిండిపోయి రాకపోకలకు కూడ వీలుకాలేదు. నగరంలో మృతదేహాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చాయి. నగరంలోని వీధుల్లో పడిఉన్న మృతదేహాలను కదిలించే వారు లేకపోవటం, మృతులకు దహన సంస్కారాలు, అంత్యక్రియలు జరిపించేందుకు ఎవ్వరూ కానరాకపోవటం వలన ఢిల్లీ నగరం పూర్తిగా శవాల దిబ్బగా మారింది.

1857 పోరాటంలో పాల్గొన్న ఆంగ్లేయాధికారి Field Marshall Lord Roberts ఈ విషాద చిత్రాన్నివర్ణించాడు. Lord Roberts కాన్పూరు నుండి తన బలగాలను ఢల్లీకి స్వయంగా నడిపంచాడు. బలగాలతో ఢల్లీ నగరంలో ప్రవశిస్తున్నప్పుడు కన్పించిన దారుణ దాృశ్యాలను చూసిన ఆ ఆంగ్లేయ సెనికాధికారి కూడా అమితంగా చలించి పోయాడు. ఆయన కళ్ళారా చూసిన ఢిల్లీ నగరాన్ని, ఢిల్లీ నగర ప్రజల దుస్థితిని 1857 సెప్టంబరు 24న ఉన్నతాధికారులకు రాసిన నివేదికలో ఈ విధాంగా పేర్కొన్నాడు:

That march through Delhi in the early morning light was a gruesome proceeding. Our way by the Lahore Gate from Chandani Chowk led through a veritable city of the dead; not a sound was to be heard butthe falling of our footsteps; not a living creature was to be seen. Dead bodies were strewn about in all directions, in every attitude that the deathstruggle had caused them to assume, and in every stage of decomposi

204