పుట:1857 ముస్లింలు.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిఆంగ్లేయుల రాక్షసత్వం


ఢిల్లీ పునరాక్రమణ తరువాత ఏవరూ ఏమిటన్నవివక్ష లేకుండాకన్పించిన వారినందర్నీ కాల్చి చంపిన ఆంగ్ల సైన్యాలు మియా ముహమ్మద్‌ అమీర్‌ పంజకుష్‌, మౌల్వీ ఇమాం బబక్ష్ లాంటి ప్రముఖ విద్వాంసులను నిర్దాక్షిణ్యంగా చంపారు. పండితు లు, కవులు- రచయితలు, విద్వాంసులు, కులీన వర్గాలకు నివాస ప్రాంతనమైన కచ్చా చలాన్‌లో ఆంగ్ల సైన్యాలు రక్తం పారించాయి. నగరంలోని సంపన్నుల నివాస ప్రాంతమైన కచ్చా చలాన్‌ మీద కన్నుపడిన ఆంగ్ల సైనికులు, అధికారులు, అధికారులచే ప్రత్యేకంగా నియమించబడిన ఏజెంట్లు గృహస్తుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. ఈ అఘాయిత్యాలను ఊహించిన నగరవాసులు తమ ఆత్మగౌరవాన్నికాపాడుకునేందుకు,

1857 ముస్లింలు.pdf

చంపుతామని బెదిరిస్తూ ప్రజలనుదోచుకుంటున్న ఆంగ్లేయుల తొత్తులు

అఘాయిత్యాలకు తమ కుటుంబ మహిళలు బలికాకుండేందుకు వారి కుత్తుకలను తమ ఖడ్గాలతో కోసివేసి, ఆ తరువాత తమ ఆయుధాలతో తమ్ముతాము అంతం చేసుకున్న సంఘటనలు అసంఖ్యాకంగా జరిగాయి. ఈ కారణంగా కచ్చా చలాన్‌ ప్రాంతంలోని గృహాలు రక్త సిక్తమయ్యాయి. రహదారుల మీద రకపు టేరులు పారాయి. కచ్చా చలాన్‌లోని ఏ ఇల్లు కూడా గృహస్తుల రక్తపు చారికల బారి నుండి మినహాయిచబడలేదని ఆంగ్లేయాధికారులు స్వయంగా తమ గ్రంథాలలో రాసుకున్న వివరాలను The Great

203