పుట:1857 ముస్లింలు.pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

లతో పొడిచి పొడిచి హింసించి ప్రాణాలు తీసి ఆంగ్ల సెనికులు ఆనందిస్తూ ఢల్లీ నగరాన్నిరక్తసముద్రం చేశారు. ఈ విధంగా దాక్కొన్నవారు ప్రతి గృహంలో నలభై నుండి యాభైవరకు ఉంటూ వచ్చారనీ అటువంటి వారందరూ ఆ తరువాత ఆంగ్ల సైనికుల చేతుల్లో శవాలుగా మారారనీ ఆంగ్ల అధికారులు స్వయంగా చెప్పుకున్నారు. (The Great Mutiny : Christopher Hibbert)

ఆనాటి సంఘటనలను ఆంగ్లేయల దుష్క్రత్యాలను హృదయ విదారకంగా వివరిస్తూ మహాకవి గాలిబ్‌ రోదించాడు. ఆనాటి ఢిల్లీ నగర దాృశ్యాన్ని వివరిస్తూ ఆంగ్ల సైన్యం నగరంలోకి ప్రవేశిస్తూనే ఎదురుబడిన వాళ్ళందర్నీ కాల్చి చంపారు. ఆస్తులను దోచుకున్నారు. నా ఎదుట రక్తసముద్రం ఉంది. నేను ఇంకా ఏమి చూడాల్సి ఉందో భగవంతునికి మాత్రమే ఎరుక. నా సన్నిహితులు, స్నేహితులు వేల మంది మరణంచారు. మనస్సులో సుళ్ళు తిరుగుతున్న బాధను పంచుకో వాలన్నా ఎవ్వరూ లేరు. చివరకు నేను మృతిచెందినా నా కోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చేందుకు కూడా ఎవ్వరూ లేరు. ఎందర్ని చంపారో, ఎంత మందిని ఉరితీశారో భగవంతుడికి మాత్రమే ఎరుక అని గుండెల్నితన్నుకొస్తున్నబాధను మీర్జా అసదుల్లా గాలిబ్‌ వెల్లగక్కారు.

ఆంగేయుల దౌష్ట్యాన్ని కళ్ళారా చూసిన కవి గాలిబ్‌ ఆ క్షోభ నుండి సంవత్సరాల తరబడి బయటపడలేకపోయారు. ఢిల్లీ వైభవ ప్రాభవాల గురించి ఎవరు ఆయన వద్ద ప్రస్తావించినా, 1857కు పూర్వం నాటి ఢిల్లీని వర్ణిస్తూ, 1857లో ఆంగ్ల సైనికులు నగర వాసుల మీద సాగించిన క్రూరమైన హత్యాకాండను, ఆనాడు ఢిల్లీలో యధేచ్ఛగా సాగిన విద్వంసకాండను హృదయ విదారకంగా వివరిస్తూ లేఖలు రాయసాగారు. అలనాటి ప్రముఖులు, ప్రజలు ఎదుర్కొన్న భయంకర పరిస్థితుల గురించి, ఆంగ్లేయులు సాగించిన

మహాపాతకం గురించి, ఆ ఘోరకలి నుండి బ్రతికి బట్టకట్టిన ప్రముఖుల- పండితు లను

పేరు పేరున పేర్కొంటూ, సంవత్సరాల పర్యంతం వారి పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నాయో ఆ వివరాలను, ఆయనను వదలక వెటాడుతున్న1857 నాటి భయానక సంఘ టనల గురించి పూసగు చ్చినట్టుగా వివరిస్తూ 1860 ఫి బవరి 16న తన కుమారునికి రాసిన లేఖలలో మహాకవి రక్తాశ్రువులను గుమ్మరించారు. (' Pradham a Swadheenatha Samgram ' , Andnd Prakash, Aajkal, Monthly (Hindi), Lucknow, May 2007, P.p 61-63)

202