పుట:1857 ముస్లింలు.pdf/203

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

రక్త సముద్ర్రంలో ఢిల్లీ నగరం

ఆధిపత్యాన్ని ప్రశ్నించిన తిరుగుబాటు యోధులంటే ఆగ్రహంతో రగలిపోతున్న ఆంగ్లేయాధికారులు సైనిక నియమనిబంధనలను పక్కన పెట్టినగరంలోని ప్రజల పట్లరాక్షసంగా వ్యవహరించడంతో అదే మార్గంలో అడ్డూ ఆపూ లేకుండా పోయిన ఆంగ్ల సైనికులు, మరింతగా రెచ్చిపోయి హింసాయుత సంఘటనలకు పాల్పడ్డారు. ఢిల్లీ నగరంలోకి ఆంగ్ల సైనికులు ప్రవేశించగానే, కన్పించిన ప్రతివార్నీ ఎటువంటి విచారణకూ తావు లేకుండా కత్తులకు ఎరవేయడం, తుపాకులతో కాల్చిచంపడం, బాయనెట్ లతో పొడిచి చిత్రహింసలు పెట్టిహత్యలు చేయడం యధేచ్ఛేగా సాగింది. స్త్రీలు-పురుషులు, పిల్లలు-వృద్ధులు, సాయుధులు-నిరాయుధులన్న కనీస విచక్షణ కూడాలేకుండా ఆంగ్ల సైన్యాలు నగరవాసుల రక్తం పారించడంతో ఢిల్లీ నగరమంతా రక్త సముద్రంగా కన్పించిందని మహాకవి మీర్జా గాలిబ్‌ హృదయవిదారకంగా రోదించాడు.

ఆంగ్ల సైనికులు నగరంలో ప్రవేశిస్తూనే సాగించిన హత్యాకాండ గురించి The Bombay Telegraph పత్రిక All the city people found within the wall when our troops entered were bayoneted on the spot; and the number was considerable, as you may suppose when I tell you in some houses forty or fifty persons were hiding అని ప్రచురించింది. (An Advanced His- tory of India, RC Mujumdar, Macmillan, Inida, 1996, P.771)

ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారిగా ఢిల్లీలో పదావీ బాధ్యాతలు నిర్వహిస్తూ 1857 నాటి తిరుగుబాటును స్వయంగా చూసిన స్వదేశీయుడైన మొయినుద్దీన్‌ హసన్‌ (Moinuddin Hasan) తన ఉన్నతాధికారి థియోఫిలస్‌ మెట్‌కాఫ్‌ అభిష్టానుసారం 1887లో ఉర్దూలో రాసిన 'గదర్‌ 1857' (Gadar 1857) గ్రంథంలో ఇచ్చిన వివరాల ప్రకారంగా, ఢిల్లీ నగరంలో కన్పించిన ఒడ్డూపొడుగూ ఉండి తెల్ల దుస్తులు ధరించిన ప్రతి వ్యకినీ ఆంగ్ల సెన్యాలు తిరుగుబాటుదారుడిగా పరిగణంచాయి. రాజ కుటుంబీకుడ్నీ గానీ, రాజ కుటుంబంతో సంబంధం ఉన్న వ్యక్తిగానీ తమ శత్రువుగా ముద్రవేశాయి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి కాకపోయినా, ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉద్యోగి అయివుండి తిరుగుబాటు సమయంలో కన్పించకుండా పోయినా అటువంటి వ్యకులందర్నీ కూడ తిరుగుబాటులో పాల్గొన్న వ్యక్తులుగా పరిగణించి తిరుగుబాటు యోధులతో

200