పుట:1857 ముస్లింలు.pdf/202

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం

తప్పించుకొగలిగేవారు కాదు. పేద రైతులు, బ్రాహ్మణ పండితులు, హాని చేయని ముసల్మాన్లు, బడి పిలలు, చంకలో పసిపల్లలున్న తల్లులు, యువతులు, వృద్ధులు, అంధులు, అవిటివారు అందరూ మంటల్లో మాడిపోయారు...వాళ్ళంతా ఉన్న పెద్ద గ్రామానికి మేము నిప్పు అంటించి, చుట్టుముట్టి. మంటల్లోంచి బయిటికి రాబోయిన వారినల్లా కాల్చేశాం. (1857 మనం మరిచిన మహాయుద్ధం యం.వి.ఆర్‌ శాస్త్రి, పేజి.131)

ఆంగ్ల సైనికులు మాత్రమే కాకుండా ఆంగ్లేయాధికారులు కూడా అపార సంపదను చేజిక్కించుకోవటం కోసం మందీ మార్బలంతో, విధ్వంసానికి అవసరమైన ప్రత్యేక పరికరాలతో, ఆయుధాలతో నగరం మీద దాడులు చేశారు. ఆంగ్ల సైనికులు,

1857 ముస్లింలు.pdf

ప్రజలు, స్వదేశీ యోధులపై క్రూరంగా విరుచుకుపడుతున్న ఆంగ్ల సైన్యం

ఆంగ్లేయ సైనికాధికారులకు తోడు ఆంగ్ల సైన్యంలో గల సిక్కు, గూర్ఖా సైనిక దళాలకు చెందిన సైనికులు కూడా ఆ వినాశకర సంఘటనలలో పాల్గొన్నారు. గతంలో ఎప్పుడో మొగలుల ప్రత్యక్షపాలనలో ఉన్న ఢిల్లీ నగరం నాశన మౌతుందని శిక్కు మతనాయకులు చేసిన శాపనార్థాలను శిక్కు సైనికులు మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ముస్లింను తాము బలితీసుకుంటున్న ధోరణులు తమ మత నాయకుల శాపాల మేరకు జరుగుతున్న చర్యలుగా భావించటం వలన శిక్కు సైనికులు ఆంగ్ల సేనలకు అన్ని విధాలా తోడుగా నిలచి దోపిడీ, విధ్వంసంలో యధేచ్ఛగా పాల్గొన్నారు.

199