పుట:1857 ముస్లింలు.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఈ సమాధానం ద్వారా తాను నిర్వహించిన దుష్క్రత్యాలు ఎంతో భయంకర మైనవని జనరల్‌ నీల్‌ పరోక్షంగా అంగీకరిస్తూ, తన చర్యలను తానే స్వయంగా ఖండిస్తే ప్రపంచ దేశాలలో గ్ర్‌ట్ బ్రిటన్‌ ప్రతిష్ట దిగజారిపోతుందని భయపడిన ఆ ఆంగ్లేయుడు తన బహిరంగ ఖండనకు అంగీకరించలేదు.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఆరంభ దశలో జనరల్‌ నీల్‌, ఢిల్లీ పతనం సమయంలో కెప్టన్‌ హడ్సన్‌, ఇతర అధికారులు సాగించిన విధ్వంసం నేపథ్యంలో మనం నాదిర్షాను మించి పోయాం అని బెంగాలు గవర్నర్‌ లార్డ్‌ ఎల్పిన్‌స్టన్‌ లాంటి ఆంగ్లేయాధికారులు తమ లేఖలలో స్వయంగా చెప్పుకున్నారు. శతృవు-మిత్రుడు అని తేడా లేకుండా ఎదురు పడిన ప్రతి వ్యక్తినీ అంతం చేయటం, అందినంత దోచుకుపోవటం, తరలించడానికి వీలుకాని ప్రతిదాన్ని తగుల పెట్టడం మాత్రమే తమ సైనికులు పనిగా పెట్టుకున్నారని బెంగాలు గవర్నర్‌ లార్డ్‌ ఎల్పిన్‌స్టన్‌ పంజాబు కమీషనర్‌ సర్‌ లారెన్స్‌కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు.

(After the siege was over, the outrages committed by our army are simply heartening. A wholesale vengeance is being taken without distinction of friend or foe. As regards the looting, we have indeed surpassed Nadir Shah. - Muslims and India’s Freedom Movement, Dr. Sahan Muhammed, IOS, New Delhi, 2002, P.23)

ఢల్లీ నగరాన్ని పూర్తిగా దోచుకునేందుకు ప్రతి మంచి భవనాన్నీ కూల గొట్టారు. సంపన్నుల గృహాలలో దాచిన సంపదను ఎత్తుకెళ్ళేందుకు ప్రతి భవంతి గోడలను వెతికి వెతికి మరీ విద్వంసం చేశారు. ప్రతి ఇంటిని పూర్తిగా తవ్విపోసారు. గృహాలను మాత్రమే కాకుండా మసీదులు,మందిరాలను కూడావిడిచి పెట్టలేదు. ఆనాటి సంఘ టనలలో పాల్గొన్న ఆంగ్ల సైనికులు తమ కుటుంబీకులకు తిరుగుబాటు యోధు లతో సాగిన పోరాటం గురించి, ఆ తరువాతి పరిణామాల గురించి తెలుపుతూ రాసిన వివరాలను Indian Mutiny గ్రంథంలో Charles Ball ఈ విధంగా పేర్కొన్నాడు.

అసమ్మతి పాకిన గ్రామాలను తగులబెట్టి నాశనం చేసేందుకు ప్రతిరోజు దండయాత్రలు చేసేవాళ్ళం...పల్లెపల్లెకు తిరిగి అన్ని వైపుల నుంచి నిప్పంటించి గ్రామ వాసులను తగల బెట్టటం చాలా మంది ఇంగ్లీషువారికి మహా వినోదంగా తోచింది. ఆయా భీభత్స దృశ్యాలను చమత్కారంగా వర్ణిస్తూ ఇంగ్లాండుకు ఉత్తరాలు రాశారు... మంటలు ఎంత వేగంగా, ఎంత లాఘవంగా అంటించేవారంటే గ్రామంలోని ఏ ఒక్కరూ

198