పుట:1857 ముస్లింలు.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

పెడుతూ హత్యాకాండ సాగించిన ఆంగ్ల సైనికులు తిరుగుబాటు యోధుల, తిరుగుబాటుకు మద్దతు పలికిన ప్రజల-ప్రముఖుల భవనాలను, గృహాలను పూర్తిగా దోచుకున్నారు. ధ్వంసం చేశారు; తగుల బెట్టారు; సర్వం నాశనం చేశారు. ఈ క్రమంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఆంగ్ల సైనికుల విధ్వంసకాండకు ధ్వంసమయ్యాయి.

అంతులేని విధ్వంస కాండ

స్వాతంత్య్రసమరయాధులు డిల్లీని ప్రదాన కేంద్రంగా, బహదాూర్‌ షా జఫరను చక్రవర్తిగా ప్రకంచుకుని, ఆంగ్లేయాధికారులను ఢల్లీ నుండి తరిమిగొట్టి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలనకు గండిగొట్టారన్న విషయమై పంజాబ్‌, కలకత్తా ప్రాంతాలలోని ఆంగ్లేయ సైనిక స్థావరాలకు వార్తలు అందాయి. ఈ వార్తలను అందుకున్న అధికారులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆఘమేఘాల మీద ఢిల్లీ వైపుకు తమ బలగాలను తరలించారు. ప్రతీకారచర్యతో మండి పడుతూ ఢిల్లీ గమ్యంగా బయలు దేరిన ఆంగ్ల బలగాలు దారిలో కన్పించిన ప్రతి గ్రామం మీద విరుచుకు పడ్డాయి. గ్రామాలలో కన్పించిన ప్రతి వ్యక్తి ప్రాణాలు తోడేయడం మాత్రమే కాకుండా ప్రజల ఆస్తి పాస్తులను దోచుకోవడం, ఎత్తుకెళ్ళ వీలుగాని సంపదను అగ్నికి ఆహుతి చేయడంతో సరిపెట్టుకోక చివరకు గ్రామాలకు గ్రామాలను పూర్తిగా తగులబెట్టి ఆ జనవాసాలను స్మశానవాటికలు చేసి పైశాచికంగా ఆనందించారు.

కలకత్తా నుండి డిల్లీకి బలగాలతో సహా బయలు దేరిన ఆంగ్లేయ సైనికాధికారి జనరల్‌ నీల్‌ మార్గమధ్యంలో అత్యంత రాక్షసంగా వ్యవహరించాడు. అలవికానంత కసితో బయలు చేరిన నీల్‌ సాగించిన దుష్ట చర్యలను ఆంగ్ల చరిత్రకారుడు Sir John Kaye పలు రికార్డులు, నివేదికల ద్వారా తెలుసుకున్నాక దారిలో శత్రువు ఆక్రమించిన రోడ్డుకు దగ్గర్లోని ప్రాంతాలన్నిటి మీదా దాడిచేసి ధ్వంసం చెయ్యమని మేజర్‌ రెనాడ్‌కు నీల్‌ లిఖితపూర్వక ఆదేశాలిచ్చాడు. తిరుగుబాటుదార్లతో సంబంధమున్న అపరాధ గ్రామాలు కొన్నింటిని నాశనం చేయడానికి గుర్తు పెట్టారు. వాటిలో నివసించే ప్రజలందర్ని ఊచకోత కోయాలి. తమ కదలికల గురించి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేని రెజిమెంట్ల సిపాయీలందరినీ ఉరితీయాలి. తిరగబడ్డ ఫతేపూర్‌ పట్నం పై దాడి చేసి, అక్కడి పఠాన్‌ జాతి ప్రజల నివాస ప్రాంతాలను నేలమట్టం చేసి అక్కడ ఉండే వారందరినీ నిర్మూలించాలి,

196