పుట:1857 ముస్లింలు.pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం

ఆ కారణంగా నిహతులైన తిరుగుబాటు యోధుల, ప్రజల వివరాలు పూర్తిగా తెలియరాని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీనగరం, పరిసర ప్రాంతాలలో ఆంగ్లేయుల తుపాకీ గుండకు, ఉరిశిక్షలకు 27 వేల మంది బలయ్యారని చరిత్ర చెబుతుంది. అంతే కాకుండా ఆంగ్ల సైన్యాలు సాగించిన సామూహిక హత్యాకాండకు అంతం లేదు. బ్రిటిషర్ల చేత అనుమానించబడి, పర్యవసానంగా నిర్బంధించబడి, ఆ తరువాత అదాశ్యమైపోయిన వారి సంఖ్య మరో 30 వేల వరకు ఉంటుందని S.Abul Hasan Ali Nadvi తన Muslims in India గ్రంథాంలో (పేజి.108) లో వెల్లడించారు.

భారతదేశ వ్యాప్తంగా తిరుగుబాటులో పాల్గొని శత్రువుతో పోరాడుతూ గాని,

1857 ముస్లింలు.pdf

తిరుగుబాటు యోధులను మూకుమ్మడిగా ఉరికంబాలకు బలిచేస్తున్న ఆంగ్లేయాధికారులు

తిరుగుబాటుకు మద్దతు పలికినందుకు గానీ, ఆంగ్ల సైనికుల క్రౌర్యానికి బలై మృత్యువాత

పడిన ప్రజలు-ప్రముఖులు మొత్తం మీద రెండు లక్షలకు పైగా ఉండొచ్చని ఒక అంచనా!

ఈ రెండు లక్షల మందిలో యాభై వేలకు పైగా ఇస్లామియా పండితులుగా ప్రఖ్యాతి గాంచిన మౌల్వీలు ఉన్నారని మరొక కథనం ద్వారా తెలుస్తుంది. ( ' Untold History of Freedom Struggle ' , M. Burhanduddin Qasmi, The Milli Gazette, 16-31 May 2007, P. 4)

అటు తిరుగుబాటు యోధులను , ఇటు ప్రముఖులు-ప్రజలను చిత్రహింసలు

195