పుట:1857 ముస్లింలు.pdf/195

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

తప్ప కుండా చరమ గీతం పాడాల్సి వస్తుందని వలస పాలకులు గ్రహంచారు. ఈ దేశంలోని ప్రజల మధ్య మతాలకు అతీతంగా వ్యకమౌతున్నఐక్యత, ఉమ్మడి శత్రువు మీద వ్యతిరేకత ఎంతటి భయానక పరిణామాలసైనా తెచ్చిపెట్టగలదని అనుభవపూతర్వకంగా తెలుసుకున్న ఆంగ్ల పాలకులకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది.

ఆ కారణంగా ప్రజల మధ్య పటిష్టంగా ఉన్న ఈ ఐక్యతను విచ్ఛిన్నచేయకుంటే తమ పరిపాలనకు విఘాతం కలుగక తప్పదని ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారులు, పాలకులు ఓ నిర్ణయానికి వచ్చారు.

ఈ విషయాన్ని ఆంగ్లేయాధికారి Charles John Griffiths వ్యక్తం చేస్తూ .. When Hindoo and Mohammedan, restraining the bitter animosity of their rival creeds, united together in the attemmpt to drive out of their common country that race which for one hundred years Ruled.. '. అని ఆనాటి పరిస్థితిని బహిర్గతం చేశాడు.

ఈ వ్యాఖ్యలు ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఇండియా లోని విభిన్నసాంఫిుక జనసముదాయాలు, ప్రథానంగా హిందూ-ముస్లింల మధ్య వ్యక్తమైన బలమైన ఐక్యతకు సాక్ష్యం పలుకుతున్నాయి.

192