పుట:1857 ముస్లింలు.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత


1857 పోరాటంలో పాల్గొన్న Holloway తాను రాసిన Essays on Indian Mutiny గ్రంథంలో ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఏదోఒక సమస్య మీద హిందూ ముస్లింల ఐక్యమౌతారన్న విషయాన్ని బ్రిటిషర్లు ఊహించలేకపోయారు. నిప్పూ-నీరు లాంటి హిందూ-ముస్లింలు ఉమ్మడి సమస్యల మీద ఒక్కటికారని ఆంగ్లేయులలో ఉన్న భావనలు సరికాదని తేలింది. మన ఆధిపత్యాన్ని కూలద్రోయడానికి హిందూ-ముస్లిం మతస్తు లు ఏకం కావడానికి ధార్మికవ్యవస్థల ప్రతినిధులు కూడా సంపూర్ణంగా అంగీకరిస్తూ అనుమతించారు అని పేర్కొన్నాడు.

(‘ The British never conceived that the Hindus and Musalmans could unite over any question...It was deemed quite as impossible occurrence for the ‘Hindus and Musalmans to agree upon a question of public interest as it was for fire and water to agree when brought into contact with each other. This assumption has proved a fallacy.For both these epresentatives of the religious bodiesperfectly agreed whilst prosecuting the scheme for overthrowing our dominion in the East...’ quoted in Bahadur Shah II, Written by Mahdi Husain, P.15)

ఈ అనుభవాల నేపథ్యంలో భారత దేశంలోని విభిన్న జనసముదాయాలను ప్రధానంగా హిందూ-ముస్లింలను ఎన్నడూ ఐక్యం కానివ్వరాదని ఆంగ్లేయులు దృఢ నిర్ణయం తీసుకున్నారు. ఆంగ్లేయ సైనిక స్థావరానికి చెందిన సైనికాధికారి John Coke 1857 తరువాత భవిష్యత్తులో భారతదేశంలో బ్రిటిష్‌ ప్రభుత్వ పాలనావిధానం ఎలా ఉండాలో సూచిస్తూ విభజించి- పాలించు విధానానికి అనుకూలంగా మతాలు, జాతుల మధ్యనున్నవిభజన యథాతధంగా కొనసాగేలా, వీరెప్పుడూ ఐక్యం కాకుండా ఉండేలా మన ప్రయత్నాలు చాలా గట్టిగా ఉండాలి అని మార్గనిర్దేశనం చేశాడు. '...Our endeavors should be to uphold in full force the (for us fortunate) separation which exists between the difference religions and races, not to endeavor to amalgamate them. Divide et imperia should be the principle of Indian Government..' (Ibid P.15)

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం నాటి ఈ వాతావరణం ఆంగ్లేయాధికారులలో భయోత్పాతాన్నికలుగచేసింది. స్వాత్రంత్యసమరాన్ని అణిచి వేయగలిగినా, ప్రజలలో రగిలిన బలమైన తిరుబాటు భావనలు వారికి నిద్రపట్టనివ్వలేదు. ఒక పథకం ప్రకారంగా, సమర్థవంతమైన నాయకత్వంతో ప్రజలు ఐక్యంగా తిరుగుబాటు చేస్తే తమ పాలనకు

191