పుట:1857 ముస్లింలు.pdf/192

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హిందూ-ముస్లింల ఐక్యత

ascetics....Mussalman on their side spoke of the Hindu religious festivals with freate courtesy and respect and were very particular to avoid any offence against Hindu customs.- Bahadur Sha II,Mahdi Husain, P.40)

ఈ విధంగా సహజీవనం సాగిస్తున్న హిందూ-ముస్లిం జనశ్రేణుల గురించి కారల్‌ మార్క్స్‌ కూడా చాలా ఉన్నతంగా వ్యాఖ్యానించాడు. 1857నాటి తిరుగుబాటుకు అంతకు ముందు జరిగిన తిరుగుబాట్లకు మౌలికంగా ఉన్నతేడాలను కారల్‌ మార్క్స్‌వివరిస్తూ హిందూ-ముస్లిం ఐక్యతను ఈ క్రింది విధంగా ప్రస్తావించాడు

'..భారత సైన్యంలో తిరుగుబాట్లు జరిగాయి; కాని ఇప్పుడు జరుగుతున్న తిరుగుబాటుకి స్వభావసిద్ధమైనట్టి వినాశకర మైనట్టీ లక్షణాలున్నాయి.తమ యూరోపియన్‌ ఆఫీసర్లను సిపాయి రెజిమెంట్లు చంపివేయడం ప్రపథమంగా ఇప్పుడే జరిగింది; హిందువులూ మహ్మదీయులూ పరస్పర వైషమ్యాలను విసర్జించి, తమ ఉమ్మడి ప్రభువు పై తిరగబడడమూ హిందాువులతో ఆరంభమైన అల్లర్లు డిల్లీసింహాసనం పై మహమ్మదీయ

చక్రవర్తిని వాస్తవంగా అధిష్టింపజేయ డంతో తుట్టతుదకు అంత మొందడమూ ; తిరుబాటు

ఏ కొద్ది ప్రాంతాలకో పరిమితమై ఉండకపోవడమూ ఇప్పుడే ప్రథమము...', (ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857-1859, మార్క్స్‌-ఎంగెల్స్‌, ప్రగతి ప్రచు రణాలయం, మాస్కో, 1983, పేజి. 43).

మాతృభూమి విముక్తి తప్ప మరిదేనికీ, చివరకు మత మనోభావాలకు కూడా, ప్రాధాన్యత ఇవ్వకుండా ఆనాడు విభిన్న మతస్థుల మధ్య సంయమనానికి, సర్దుబాటుకు ఉదాహరణలుగా చెప్పుకోదగిన సంఘటనలు చాలా జరిగాయి. ఈ సంఘ టనలలో అటు ప్రజలు కానీ, ఇటు సిపాయీలు కానీ చివరకు ప్రముఖులు గానీ తమ మతమనోభావాల కంటే శత్రువుకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన చర్యలకు అధిక ప్రాధాన్యత నిచ్చారు. ఆ విధంగా జరిగిన ఒక సంఘటనలో మొగల్‌ చక్రవర్తి స్వయంగా పాల్గొన్నారు. ఆంగ్ల సైన్యాలు ఢిల్లీని చుట్టుముట్టి తీవ్రంగా పోరాటం సాగిస్తున్నాయి. ఆంగ్లేయుల దాడిని తిప్పికొడుతున్న స్వదేశీ సిపాయి యోధులు తమ వద్దనున్న ఫిరంగులను సరిచేసు కుంటూ, మరిన్ని ఆయుధాలు సమకూర్చుకుంటున్న సందర్బంగా మొగల్‌ ప్రబువు షాజహాన్‌ కాలం నాటి ఫిరంగి నొకదానిని కనుగొన్నారు. ఆ ఫిరంగికి తగిన మరమ్మతులు చేసి శత్రువు మీద ప్రయాగించడానికి తయారు చేసు కున్నారు. ఆ ఫిరంగిని ఉపయాగించే

189