పుట:1857 ముస్లింలు.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

2001, పేజి. 103)

సమున్నత స్థాయిలో సహజీవన కళ

ఈ విధంగా అటు ప్రజలలో ఇటు స్వదేశీ పాలకులలో వ్యక్తమైన ఐక్యత ఎంత దూరం సాగిందంటే, ఏ మతానికి చెందిన వారైనా తిరుగుబాటు యోధులై ఉంటే చాలు వారిని కాపాడుకునేందుకు మతాలకు అతీతంగా, స్త్రీ-పురుష బేధం లేకుండా సామాన్య ప్రజలు ఆత్మార్పణలకు వెరవకుండా ముందుకు వచ్చిన సంఘటనలు ప్రథమ స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో చోటు చేసుకున్నాయి.

ఈ ఐక్యత కేవలం ఆంగ్లేయులతో పోరాడుతున్న తిరుగుబాటు యోధులలో, స్వదేశీయుల పాలనను ఆకాంక్షిస్తున్న స్వదేశీ పాలకులలో, స్వతంత్ర దేశంలో లభించే ప్రయోజనాల కోసం పోరాటాన్ని సమర్థిస్తున్న ఇతర వర్గాలలో మాత్రమే కాకుండా దేశంలోని సామాన్య ప్రజలలో కూడా బలంగా వ్యక్తమైంది. మతాలకు అతీతంగా ఇరుగు పొరుగు సంబంధాలను పటిష్టం చేసుకోవడం, ఒకరికి మరొకరుగా ప్రజల సహకరించు కుంటూ సహజీవనం సాగించటం సహజంగా సాగింది. ఆ కారణంగా చరిత్రకారుడు

C.F. Andrews ఇండియాలో విభిన్న మతస్తులను ఇరుగుపొరుగు వారితో ప్రశాంతమైన జీవితాలు గడపటమనే కళ సమున్నత స్థాయికి చేరుకుంది అని వ్యాఖ్యానించాడు. ( The art of living peaceably with neighbours of a diffrent religion had reached a very high level - Bahadur Sha II, Mahdi Husain, P. 41)

ఇండియాలోని హిందూ-ముస్లింలు తమ పండుగుపబ్బాలలో కూడా కలసివులసి వ్యవహరించేవారని, ఒకరి పండుగలలో మరోకరు భాగస్వాములయ్యేవారని, ఈ విధంగా హిందువులు తమ పండగలకు ముస్లింలను, ముస్లింలు తమ పండుగలకు హిందువులను ఆహ్వానించటం, ఆ ఆహ్వానాలను గౌరవిస్తూ ఒకరి పండుగలలో మరొకరు సంతోషంగా పాల్గొని అంతా కలసి ఆనందించటం ఇక్కడ సర్వసాధారణ విషయమని కూడా C. F. adrews వివరిసూ, ఈ లౌకిక విధానం ఇండియాలో ఒక సాంప్రదాయంగామారిందని వ్యాఖ్యానించాడు.

(It is quite common in those days for the two communities to join together in diffrent religious festivals.Hindus would go to a Muslim Festival and Musalmans would go to a Hindu festival, This had become a natural local custom...The Musalmans had great resect for certain Hindu

188