పుట:1857 ముస్లింలు.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత

turn money granted for the purpose unspent to the treasury ’ అని పేర్కొన్నాడు. ఈ విధాంగా రోహిల్‌ఖండ్‌లోని హిందూ-ముస్లింలు ప్రధానంగా హిందూ సోదరులు, మా మతాలు వేరైనా మా మాతృభూమి ఒక్కటే, మా మార్గం ఒక్కటే, మాలక్ష్యం ఒక్కటేనంటూ మతం పేరిట మనుషుల్ని చీల్చి పబ్బం గడుపుకోవాలనుకున్నబ్రిటిష్‌ పాలకుల ఎత్తులను బలంగా త్రిప్పికొట్టి హిందూ-ముస్లింల ఐక్యతకు ఆదర్శప్రాయమై నిలిచారు.

ఉమ్మడిగా పోరాడిన మౌల్వీ-మహంత్‌

ప్రజలు మాత్రమే ఐక్యంగా ఉమ్మడి శత్రువును పరిమార్చడానికి చేతులు కలపటం కాకుండా హిందాూ-ముస్లిం ధార్మికవేత్తలు కూడ ఒకరికి తోడు మరొకరుగా ఈ పోరాటంలో భుజం భుజం కలిపి ముందుకు సాగారు.

ఈనాడు హిందూ-ముస్లింల మధ్య అగాధాన్ని సృష్టించడానికి ప్రధాన ఆయుధంగా ఉపయోగపడిన అయోధ్య ఆనాడు హిందూ-ముస్లింల మధ్య ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ గడ్డ మీద ముస్లిం మౌల్వీ, హిందూ మహంతులు చేతులు కలిపి ఉమ్మడి శత్రువు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికంబాల మీద వ్రేలాడిన మహత్తర చారిత్రక సంఘటనలు జరిగాయి. అయోధ్యలోని ప్రసిద్ధి చెందిన హనుమాన్‌గడి పూజారి బాబా రామచరణ దాస్‌ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి సన్నద్ధమౌతున్నారు. ఆ విషయం తెలుసుకున్న అయోధ్యకు చెందిన ప్రముఖ ధార్మిక పండితుడు మౌల్వీ అమీర్‌ అలీ తక్షణమే బాబా రామచరణ్‌ దాస్‌తో చేతులు కలిపారు. మౌల్వీ తన అనుచరులతో బాబా రామచరణ్‌ దాస్‌ యోధులతో ఏకమై ఉమ్మడి సైన్యాలతో ఆంగ్ల సైన్యాల మీద యుద్ధం ప్రకటించారు.

ఈ పోరాటంలో పరాజితులైన మౌల్వీ అమీర్‌ అలీ, బాబా రామచరణ్‌ దాస్‌ ఇద్దరినీ ఆంగ్లేయాధికారులు అరెస్టు చేశారు. ఈ యోధులిద్దరి మీద రాజద్రోహం నేరారోపణ చేసి విచారణ జరిపారు. ఆ విచారణ ఫలితంగా బాబాకు, మౌల్వీకి ఆంగ్ల సైనికాధికారులు ఉరిశిక్ష విధించారు. ఈ విధంగా ప్రకటించిన ఉరిశిక్షను వెంటనే అమలు చేయ సంకల్పించిన అధికారులు తక్షణమే ఉరి ఏర్పాట్లకు ఆదేశించారు. ఆ ప్రాంతంలో ఉరిశిక్ష అమలుకు ప్రత్యేకంగా ఉరివేదిక లేకపోవడం వలన

185