పుట:1857 ముస్లింలు.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

గ్రామాల్లో వెల్లివిరిసిన ఐక్యత

1857 నాటి రోజుల్లో ఢల్లీ నగరంలో మాత్రమే కాదు ప్రతి స్వదేశీ సంస్థానంలో హిందూ-ముస్లిం ఐక్యత చాలా స్పష్టంగా కన్పించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలలో కన్పించే సహజసిద్ధమైన ఈ ఐక్యత ఆంగ్లేయుల మీద సాగుతున్న పోరాటం సమయంలో మరింత బలంగా దర్శనీయమైంది.

ప్రథమ స్వాతంత్య్రసంగ్రామాన శ్రీకారం చుడుతూ మీరట్ నుండి బయలు దేరిన తిరుగుబాటు యోధులు ఢిల్లీ బాట పట్టి చక్రవర్తి బహదాూర్‌ షా జఫర్‌ వద్దకు వెళ్ళారన్నవార్త తెలిసాక ఆంగ్లేయాధికారులు హుటాహుటిన తమ బలగాలతో వారిని వెంబడించారు. ఆ విధంగా వెంబడించిన ఆంగ్ల సైనికులను దారిలో గల సోనహార్‌ గ్రామానికి చెందిన హిందూ-ముస్లిం ప్రజానీకం అడ్డగించారు. ఈ గ్రామంలోని స్వేఛ్చ- స్వాతంత్య్రాలను కోరుకుంటున్నయోధులు ఇస్మాయిల్‌, రాంభాయి, జాసూదిలు ఐక్యంగా ఆంగ్లేయులను అడ్డుకు న్నారు. ఈ యోధుల సాహసోపేత నాయకత్వంలో హరిచరన్ పూర్‌ అను గ్రామం వద్ద గ్రామప్రజలు ఆంగ్ల సైన్యాలను ఎదాుర్కొన్నారు.

ఈ యోధు లు గ్రామాలలోని జాట్ లను, ముస్లింలను ఏకం చేశారు. ఆ తరు వాత పరిసర గ్రామాలలోని ప్రజలను కులమతాలకు అతీతంగా ఏకం చేసి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రేరేపించారు. ఆ సందర్భంగా ఆంగ్లేయులు అపరిచితులు, శత్రువులు. హిందూ-ముస్లింలు ధార్మికంగా వేర్వేరు జన సమూహాలైనప్పటికీ ఒక జాతివారు ఒకరికి మరోకరు తోడు, అను ఐక్యతా భావనతోనే ఏకమై ఒక్కటిగా మసలుకున్నారని, ఆ ఐక్యభావనతో ఆంగ్లేయులను ఎదుర్కొన్నారని,

ఆనాటిపరిస్థితు లను స్వయంగా చూసిన ప్రముఖ ఉరూ-పర్షియ న్‌ కవి Francis Godlieu Quinn తన రచనలలో ఆ విషయాలను చాలా వివరంగా పేర్కొnnaaడని ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహించిన మహాది హసన్‌ బహదూర్‌ షా -2 అను తాను రచించిన గ్రంథంలో ఆనాటి ఉదంతాలను ఉటంకించారు. (Bahdur Shah II, Mahadi Hasain, MN Publishers and Distributors, New Delhi, 1987, Page. XIi)

176