పుట:1857 ముస్లింలు.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హిందూ-ముస్లింల ఐక్యత

(Phoolwalon-ki-sair) సంతను బహదూర్‌ షా జఫర్‌ ఏర్పాటు చేశారు. హిందూ-ముస్లిం ప్రజానీకం అత్యధికంగా పాల్గొనే ఈ సంతను బహుదాూర్‌ షా జఫర్‌ స్వయంగా ప్రారంభించారు. ఆ విధంగా ఆనాడు ఆయన ఆరంభించిన 'ఫూల్‌ వాలోంకి సైర్‌' పండగ నగరంలోని హిందూ-ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఆంగ్లేయుల పాలనా కాలంలో కూడ సాగి ఆనాి ఐక్యతకు ఆనవాలుగా నిలచింది.

ఢిల్లీ నగరంలో వ్యక్తమైన హిందూ-ముస్లింల ఐక్యత ఆంగ్లేయులను తీవ్రంగా కలవరపర్చింది. ఢిల్లీ నగరం కేంద్రంగా సాగిన స్వాతంత్య్రసంగ్రామం ఆంగ్లేయులను భీతావహులను చేసింది. భారత దేశంలోని ప్రజలు మతాలకు అతీతంగా ఐక్యంగా

1857 ముస్లింలు.pdf

కలసి పోరాడటం కాదు మరణాన్ని కూడా కలసి పంచుకుంటున్నహిందూ-ముస్లిం యోధులు

ఉన్నంత కాలం విజయం సంగతి తరువాత, ప్రపంచంలోని మరేశక్తి కూడ తమను స్వదేశీయుల బారి నుండి ఇక రక్షించలేదన్నంతగా ఆంగ్లేయులు భయపడి పోయారు. ఆ విషయాన్ని స్వయంగా ఆంగ్లేయ సైనికాధికారులు తమ డైరీలలో రాసుకున్నారు. (‘...no power on earth could have saved us from total annihilation...’ - A Narrative of the Siege of Delhi ,1857, Charles John Griffiths, London, 1910, P. 35)

175