పుట:1857 ముస్లింలు.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

విఘాతం కలిగినా స్థానిక అధికారి మీద కఠినంగా చర్య లు తీసుకోవటం జరుగుతుందని అధికారులను హెచ్చరించారు.

' బిస్మిల్లా' తో అధికారిక రికార్డుల ఆరంభం

బహదాూర్‌ షా ప్రభుత్వం జారీచేసిన గోవధ నిషేధ ఆజ్ఞలకు స్వదేశీ హిందూ పాలకులు సముచిత రీతిలో ప్రతిస్పందించారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా హిందూ- ముస్లింల ఐక్యత మరింత బలపడేందుకు తగిన చర్యలను స్వయంగా తీసుకున్నారు. స్వదేశీ హిందూ పాలకులు తమ ప్రాంతాలలో మొగల్‌ ప్రభుత్వ చిహ్నాలను, మొగల్‌ ప్రభుత్వపాలనా పరమైన విధానాలను యధాతధంగా, ఖచ్చితంగా అమలు చేశారు. ఈ మేరకు వ్యక్తమైన సానుకూల ప్రతిస్పందనలో భాగంగా కాన్పూరు అధినత నానా సాహెబ్‌ మొగల్‌ ప్రభుత్వచిహ్నాలను అమలులోపెట్టారు. చంద్రమానాన్నిఅనుసరించటమే కాకుండా, శుక్రవారం శెలవును కూడ ప్రకటించారు. మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా కాన్పూరు రాజ్యాధినేతగా తన అధికారిక లేఖలలో, ప్రబుత్వ రికార్డులలో బిస్మిల్లా అని రాయడాన్ని కొనసాగించారు. ఈ విధగా తిరుగుబాటు యోధులు విభిన్న మతాలకు చెందిన వారైనప్పటికి పరస్పరం తమ తమ మతమనోభావాలను గౌరవించుకుంటూ ఉమ్మడి శత్రువు మీద యుద్ధంప్రకటించడంతో హిందూ-ముస్లిం జన సముదాయాలు కూడా ఆ మార్గాన కలిసి నడిచారు.

(‘ the rebel government at Delhi banned the slaughter of cows as a gesture of goodwill to the Hindus; while the Hindu rebel leaders (for instance, Nana Sahib) returned the compliment by maintaining all the state symbols of the Moghul government- for instance, the use of lunar calendar, the inscription of ‘ Bismillah’ in the official communications and reports and even the observance of Friday as holiday. ‘ - K.M. Ashraf, Muslim Revivalists and the Revolt of 1857, PC Joshi Ed. Rebellion 1857 - A Symposium, PPH, 1957, P.4)

1857నాి తిరుగుబాటు సమయంలో తగిన ప్రయాజనాలను ఆశించి మాత్రమే కాకుండా, ఈ రండు జనసముదాయాల మధ్య సామరస్యాన్ని ఆకాంకిస్తూ ఢల్లీ నగరంలోని హిందూ-ముస్లింలంతా కలసి ప్రతి ఏడాది నిర్వహించుకొనే 'ఫూల్‌ వాలోంకి సైర్‌'

174