పుట:1857 ముస్లింలు.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత

నాయకుడిగా ముస్లిం దళపతులను కోరిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని చరిత్ర సాక్ష్యం పలుకుతుంది. ఈ విధంగా హిందూ-ముస్లిం అను తేడా లేకుండా అన్ని దాళాలలో హిందూ-ముస్లింలు కలసిపోయి ఉండటం సర్వసాధారణ విషయం.

ఈ వాతావరణం బ్రిటిష్‌ సైన్యంలోని స్వదేశీ సిపాయీల దళాలలో మాత్రమే కాదు అంతకు పూర్వం కూడా ఇండియాలోని పలు ప్రాంతాలను పాలించిన హిందూ-ముస్లిం పాలకుల సైన్యాలలో కూడా ఆయా పాలకుల మతాలతో ఏ మాత్రం సంబంధ లేకుండా హిందూ-ముస్లిం సైనికులు అటు ఇటు ఉండేవారు. యుద్ధ సమయంలో పాలకుని పక్షంగా శత్రు సంహారం గావించేప్పుడు శత్రుసైనికుడు స్వమతస్తుడా? పరమతస్థుడా? అనేకంటే శత్రువును శత్రువుగా చూడటం జరిగింది. ఆ కారణంగా పలు రాజ్యాలతో విలసిల్లిన ఈ భూభాగంలోని హిందూ రాజులు హిందూ రాజులతో పోరాడినా, ముస్లిం రాజులతో పోరాడినా, ముస్లిం ప్రభువులు ముస్లిం పాలకులతో పోరాడినా హిందూ రాజులతో పోరాడినా ప్రజలు, సైనికులు మాత్రం తామే మతానికి చెందిన వారం అని కాకుండా తాము ఏ రాజ్యం-ఏరాజు ఉప్పు తింటున్నామన్న ఆలోచనలతో యుద్ధభూమిలో తమ ప్రభువు కోసం ప్రాణాలు ధారపోశారు. మతాలకుఅతీతంగా ప్రభుపక్షం అను ఘన వారసత్వం గలవారు కనుక హిందూ-ముస్లిం తేడాలేకుండ అత్యంత క్లిష్ట సమయాలలో ప్రజలు ఐక్యంగా మసలుకుంటూ ఐక్యతకు ప్రతీకలుగా నిలిచారు.

ఈ ఐక్యభావన తరతరాలుగా ప్రజలలో జీర్ణమైయున్న కారణంగా ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం రగులుకునేందుకు గల కారణాలలో ప్రధానమైనదిగా చెబుతున్న తుపాకి తూాటాలకు ఆవుకొవ్వు-పందికొవ్వు వాడటం లాంటి సమస్య విషయంలో ముస్లిం సైనికులు హిందూసెనికులకు తోడుగా నిలువగా, హిందూ సైనికులు ముస్లిం సైనికులకు అండదండలు అందిస్తూ ఏకోన్ముఖంగా సాగారు.

బెంగాల్‌లోని స్వదేశీ సైన్యంలో ఉన్నముస్లిం సైనికులను తుపాకి తూటాలను వాడమని ఆంగ్ల సైనికాధికారులు ఆదేశించగా అందుకు ముస్లిం సైనికులు నిరాకరించారు. అంతటితో ఆగకుండా తమ సోదర హిందూ సైనికులు తూాతూటాలను వాడేందుకు అంగీకరిస్తే మాత్రమే తామూ ఆ తూటాలను, తుపాకులను వాడగలమని అంతవరకు తూటాలు వాడే ప్రసక్తి లేదని తెగేసి చెప్పిన సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలు మత ప్రమేయం లేకుండా విభిన్న మతసుల మధ్య నెలకొనిఉన్న పటిష్టమైన

169