పుట:1857 ముస్లింలు.pdf/171

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

స్వదేశం వారికి పరమ పవిత్రమైనదిగా భావించి తమ గడ్డ కోసం, తమ ఏలిక కోసం, మతాలతో సంబంధం లేకుండాప్రాణత్యాగాలకు ఆయా ప్రాంతాల ప్రజలు సిద్ధ్దపడ్డ గొప్ప వారసత్వం చరిత్రగలది ఇండియ

ప్రజలలో ఉన్న ఈ మానసిక స్థితిని గమనించిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు 1757 ప్లాసీ యుద్ధం, ఆ తరువాత 1764 నాటి బక్సర్‌ యుద్ధం తరువాత క్రమంగా స్వదేశీ పాలకుల మీద సంపూర్ణ ఆధిపత్యం సాధించుకున్నాకూడ ఆయా ప్రాంతాలలో పదవీచ్యుతులైన పాలకుల వంశీయులను అధికార పీఠాల మీద కూర్చొబెట్టి, వారి పేరుతో మాత్రమే తమ ఇష్టానుసారంగా పాలన చేశారు.

1765లో బెంగాల్‌ దివానిని స్వాధీనం చేసుకున్న షా ఆలం దగ్గర నుండి చివరి మొగల్‌ పాదుషా బహద్ధూర్‌ షా జఫర్‌ వరకు వారి మీద మతాలకు అతీతంగా ప్రజలలో స్థిరపడి ఉన్న అభిమానం-గౌరవం మూలంగా ఆ పాలకులను పూర్తిగా సింహాసన భ్రష్టుల్ని చేయడానికి ఆంగ్లేయులు సాహసించలేదు. ప్రజల మనోభావాలకు విఘాతం కలిగితే తగుమూల్యం చెల్లించాల్సి వస్తుందన్న భయంతో తొలిదశలో ఆంగ్లేయ పాలకులు పాలనాపరమైన అన్ని వ్యవహారాలను స్వదేశీ పాలకుల పేరుతో సాగించారు. ఆంగ్లేయుల ఈ చర్యలకు కారణం మతాలతో సంబంధం లేకుండా పాలకుల పట్ల ప్రజలు చూపెట్టిన గౌరవాభిమానాలు మాత్రమే. అటువంటి బలమైన మానసిక పునాది కలిగిన గడ్డ అయినటువంటి భారత దేశంలో పరాయి పాలకులకు వ్యతిరేకంగా ప్రజలలో సాంప్రదాయకంగా ఐక్యత వ్యక్తమైంది. ఈ స్థితికి స్వరాజ్యం-స్వమతం అను ప్రాతిపదిక కూడ చాలా బలంగా తోడయ్యింది.

ముస్లిం సైనికులకు హిందూ దళపతి

ఆనాడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సైనికులలో తామంతా స్వదేశీయులమన్నఅభిప్రాయం బలంగా ఉండేది. బెంగాల్‌ కేంద్రంగా కంపెనీ సేవలోఉన్నస్వదేశీ సైనికులలో మతపరమైన తేడాలు ఏమాత్రం కన్పించేవి కావు. ఆ దళాలలో మతాలకు అతీతంగా హిందూ-ముస్లిం సైన్యాలు కలిసి మెలసి ఉండేవి. సామర్ధ్యం ప్రధానమని భావించిన సైనికులు ముస్లిం సైనికులు అత్యధికంగా గల సైనికుల దళంలోని సభ్యులు తమ దళనాయకుడిగా హిందూ సైనికాధికారిని కోరిన సంఘటనలు ఉన్నాయి. హిందువులు అత్యధికంగా గల సైనికదళాలలో ఆ దళాలకు

168