పుట:1857 ముస్లింలు.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం - 6

హిందూ-ముస్లింల ఐక్యత

1857 ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం పరాయి పాలకులకు వ్యతిరేకంగా ఆయుధం చేపట్టిన హిందూ-ముస్లిం యోధుల ఐక్యతకు ప్రబల ప్రతీకగా నిలుస్తుంది. ప్రాదేశికంగా చూస్తే ఢిల్లీ నగరాన్ని ప్రధాన కేంద్రంగా, పాలకుని పరంగా చూస్తే మొగల్‌ పాదుషా బహదాూర్‌ షా జఫర్ ను చక్రవర్తిగా స్వీకరించి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల మీద తిరగబడిన ప్రజలు, సిపాయీలు, తిరుగుబాటు యోధులు, స్వదేశీపాలకులు మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యతను ప్రదర్శించారు. ఈ ఐక్యతకు తమ మీద పెత్తనం చేస్తున్నపరాయి పాలకులను తమ గడ్డ మీద నుండి తరిమి వేయాలన్న ప్రగాఢ ఆకాంక్ష ప్రధాన కారణం కాగా, ఆంగ్లేయుల ఆధిపత్యం-అంతులేని దాష్టీకం, కంపెనీ పాలకుల అరాచకం, నిరంతర దోపిడి మత-ఆచార-సాంప్రదాయాలలో వలసపాలకుల జోక్యం, ప్రజలలోని స్వదేశీయాభిమానం ఇతర కారణాలయ్యాయి.

ప్రభుభక్తి పరాయణత అనేది మతాలకు-కులాలకు అతీతంగా ఇక్కడి ప్రజానీకంలో ఏర్పడిన బలమైన సహజసిద్ద మానసిక అవస్థ. స్వదేశీ పాలకుల మధ్యన ఎన్ని యుద్ధాలు జరిగినా, ఒకరి మీద మరొకరు మరెన్ని పోరాటాలు చేసినా, ఎవరి

167