పుట:1857 ముస్లింలు.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

గంటకట్టే వారెవరెన్నది సమస్యగా మారింది. ఆంగ్లేయులను మంచి మిత్రులుగా పరిగణస్తూ అధికమౌతున్న వారి పెత్తనాన్ని కూడా చూసీ చూడకుండా భరిసున్న నిజాంకు ఎవరు నచ్చ చెప్పగలరు? అంతదుస్సాహసం చేయటమంటే ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవటమే కనుక ఏంచేయాలన్న ఆలోచనలు సాగాయి.

ఆ సమయంలో బాజీ ఖాన్‌, మౌల్వీ ఇబ్రాహీంలు, అజం సింగ్, మిర్ధా సింగ్ అను నలుగురు సాహసికులు ముంద్ఫుకు వచ్చారు. ఈ నలుగురు యోధులు తమ ప్రాణాలను కూడ లెక్కచేయక నైజాం సంస్థానాధీశుని వద్దకు వెళ్ళి ఆయన మనస్సు మార్చేందుకు నిర్ణయించుకున్నారు. చివరకు పులిబోనులో ప్రవేశించ సాహసించారు. నిజాం సంస్థానాధీశునికి నచ్చచెప్పేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ విఫల ప్రయత్నంలో ఆ నలుగురు నిజాంకు ఈ క్రింది విధంగా నచ్చజెప్పారు.

వందాలాది మైళ్ళ దూరం నుండి సముద్రం మీద వచ్చిన బ్రిటిషు వారి సంఖ్య ఎంత? మీరు వారికెందుకు దాసోహమనాలి? ఎదురు తిరగండి. దేశ ప్రజలందరు మీకు అండగా వుంటారు. పరాయి పెత్తనం వద్దు. స్వతంత్రంగా వ్యవహరించండి! లక్షమంది భారతీయులు ఒక్కొక్క ఇంగ్లీషు వాడ్ని తన్నితే చాలు. అసువులు బాసిపోతారు. వారు చచ్చిన జాడ తెలుపడానికి కూడ ఎవ్వరూ ఉండరు. ధైర్యం చేయండి. దేశమాత పిలుపు వినండి. ఆమెను పరాధీనం చేయకండి! (హెదారాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, పేజి.49)

ఈ విధాంగా నిజాం సంస్థానంలో మాత్రమే కాకుండ ఆంధ్ర - రాయలసీమ ప్రాంతంలో కూడ ఆంగ్లేయాధికారుల పెత్తనం మీద ప్రజల నుండి రుసరుసలు విన్పించాయి. ఆంగ్లేయులు అణిచివేతకు పాల్పడుతున్నా ఏమాత్రం భయపడకుండా స్వేచ్ఛను ఆకాంక్షిస్తున్నతెలుగు గడ్డ బిడ్డలు పరాయి పాలకుల పట్ల వ్యతిరేకతను వ్యకంచేస్తూ , ప్రదమ స్వాతంత్య్ర సమరానికి పూర్వం, సంగ్రామ సమయంలో, సంగ్రామం తరువాత కూడా తమదైన పాత్రను పోషించి చరితార్థులయ్యారు.

166