పుట:1857 ముస్లింలు.pdf/163

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

లేకపోయారు. (The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volume I (1800-1905 AD), Govt. of AP, Hyderabad, 1997, Page. 147)

1857 నవంబరు 7న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ప్రభుత్వ కచేరి మీద దాడి జరిగింది. ఆయుధాలు చేపట్టిన నాలుగు వందల మంది రోహిల్లాలు కచేరి ఆవరణలోకి దూసుకొచ్చారు. ఆ సమయంలో కంపెనీ సైనికుల ప్రతిఘటన అంతగా లేకపోవటంతో కోశాగారంలోని నగదును, ఆయుధాగారంలోని ఆయుధాలను స్వంతం చేసుకున్నారు.ఈ సాహకృత్యంలో హిందూ-ముస్లిం యోధులు ఉమ్మడిగా పాల్గొన్నారు. ఈ ఆకస్మిక దాడికి కంపెనీ అధికారులు బెంబేలెత్తిపోయారు

1857 ఆగస్టు 21న ప్రథమస్వాతంత్య్ర సమరయోధుడు రహింబేగ్ ను ఆంగ్లేయాధికారులు అరెస్టు చేశారు. మొహర్రం పండుగ సందర్భంగా రహింబేగ్ తిరుగు బాటుకు సిద్ధమయ్యారు. ఆ రహస్యం బయటపడటంతో బేగ్ ను ఆయన సహచరులు ఖాజీ మున్‌దార్‌దార్‌ అలీ, హుసైన్‌ బేగ్, షబీబ్‌ బేగ్ , మీరా హుస్సేన్‌, సిలార్‌ ఖాన్‌, మీర్‌ లుబ్బా ఖాన్‌, మీర్‌ వజీర్‌ అలీ, గాలిబ్‌ బేగ్, ముస్తాబ్‌ సాహెబ్‌, ఖాద్‌ ముహమ్మద్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ దాదా సాహెబ్‌ తదితరులను అరెస్టు చేశారు.

ఈ తిరుగుబాటును ప్రస్తావిస్తూ ఆగస్టు 22న రాజమండ్రిలోని ఆంగ్లేయాధికారి మద్రాసులోని ఆంగ్లేయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో భారీ కుట్రను మొగ్గలోనే తుంచగలిగామని చెప్పుకున్నాడు. కాగా ఆ తిరుగుబాటు కేవలం రాజమండ్రి వరకు మాత్రమే పరిమితం కాలేదని, మచిలీపట్నం, గుంటూరు జిల్లాలను కూడ కలుపుకుని ప్రజలను రచ్చగొట్టి ఒకేసారి తెల్లవారి మీద తిరుగబడేందుకు పెద్ద వ్యూహం పన్నారని...ముసల్మాన్లు ఇందులో ప్రదాన పాత్ర వహించారని, ఆ లేఖలో వివరించాడు. (The Freedom Struggle in Andhra Pradesh (Andhra), Volume- I (18001905 AD), Govt. of AP, Hyderabad, 1997, P. 156-157)

ఈ వార్తలతో గుండెలదిరిన ఆంగ్లేయాధికారులు ముంచుకొచ్చిన ముప్పు కొద్దిలో తప్పిపోయిందని భావిస్తూ అప్రమత్తులై ఉండాల్సిందిగా ఇతర ప్రాంతాల అధికారులకు వర్తమానం పంపారు. అనుమానితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ దాడులు చేసి అరెస్టులను ముమ్మరం చేశారు. ఈ అరెస్టులలో 14 సంవత్సరాల సయ్యద్‌ లాల్‌ అను యోధుడు ఉండటం విశేషం. ఈ యోధుడు 7 సంవత్సరాల కారాగార శిక్షకు గురయ్యారు.


160