పుట:1857 ముస్లింలు.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

డేవిడ్‌సన్‌ పోరాటంలో పాల్గొన్నఇతర యోధు లను, ప్రజలను వెంటాడి బంధించి చిత్రహంసలు పెట్టించాడు. రెసిడెన్సీ మీద దాడి సమయంలో తిరుగుబాటు యోధులకు ఉపయోగపడిన భవంతులు, వారు తప్పించుకోడానికి పనికొచ్చిన గృహాలను నేలమట్టం చేయించాడు. ఆ భవంతులు, గృహాల యజమానుల ఆస్థులను ప్రబుత్వం జప్తు చేసింది. ఆ కారణంగా సంపన్నులైన అబ్బాస్‌ సాహెబ్‌ (అబ్బన్‌ సాహెబ్‌), జైగోపాల్‌ దాస్‌ పిత్తిలు బజారున పడ్డారు . ఆనాడు తిరుగుబాటులో పాల్గొన్నారని అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని ఆంగ్లేయులు అరెస్టు చేసి జైలులో వేయించారు.

రాయలసీమలో రగిలిన పోరాటం

ఈ పోరాట ప్రకంపనలు హైదారాబాదు వరకు పరిమితం కాలేదు. తిన్నగా రాయలసీమ ప్రాంతానికి కూడ విస్తరించాయి. ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం ఆరంభం కాగానే కడపజిల్లా ఎల్లంపేట నివాసి షేక్‌ పీర్‌ సాహెబ్‌ తిరుగుబాటుకు ప్రయత్నాలను ఆరంభించారు. ప్రజలలో తిరుగుబాటుకు తగిన బౌతిక-మానసిక వాతావరణం ఏర్పాటుకు సిద్ధమయ్యారు.

1857 ఆగసు ్ట 28న కడప కోంన్మెంటులోని భారతీయ సైనిక అధికారులను, సైనికులను తిరగబడమని ఆయన నేరుగా ప్రోత్సహించారు. పుట్టుకతో అంధుడైన పీర్‌ సాహెబ్‌ పోరుబాటను ఎంచుకోవడమేకాకుండా ముహర్రం పండగ సందర్బంగా తెల్లవారి పాలన తప్పక అంతరిస్తుందని ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా స్వదేశీ సైనికులను ఆకట్టుకుని తిరుగుబాటుకు షేక్‌ పీర్‌ సాహెబ్‌ ముమ్మరంగా సన్నాహాలు ఆరంభించారు. ఆయన చర్యలను పసికట్టిన బ్రిటిష్‌ సైనికాధికారులు పీర్‌ సాహెబ్‌ పథకం పూర్తిగా అమలులోకి రాకముందే ఆయనను అరెస్టుచేసి, విచారణ జరిపి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. తిరునల్వేలి ఖైదులో ఆయన జీవితం ముగిసింది.

ఈ ప్రయత్నాలలో భాగంగా మహమ్మదీయ న్యాయశాస్త్ర అధికారిగా బాధ్య తలు నిర్వహిస్తున్న మౌల్వీ సయ్యద్‌ అజీజ్‌ హుస్సేన్‌ ఇంటింటికి తిరిగి తిరుగుబాటుదారుల కోసం ఆహారపదార్ధాలు, డబ్బు సేకరించారు. తుపాకులకు పూసే గ్రీసులో పంది, ఆవు

158