పుట:1857 ముస్లింలు.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తి స్థాయిలో దాడిచేసే ముందుగా తిరుగుబాటు యోధుడు చిద్దాఖాన్‌ ఆయన అనుచరులను విడుదల చేసి తమకు అప్పగించమని పఠాన్‌ తుర్రేబాజ్‌ ఖాన్‌ రెసిడెంటుకు మరోసారి కబురు చేశారు. అంతా ఊహించినట్టే బ్రిటిష్‌ రెసిడెన్సీ నుండి ప్రతికూలత వ్యక్తమయ్యింది. చివరకు దాడి కన్నా మరోమార్గం లేకుండా పోయింది.

రెసిడెన్సీ మీద దాడికి సిద్ధమై వచ్చిన తిరుగుబాటు యోధుల అంచనాలకు భిన్నంగా రెసిడెన్సీ వద్ద పరిస్థితులు ఎదురయ్యాయి. రెసిడెన్సీలో ఉన్న స్వదేశీ సైనికులు తమ దాడికి మద్దతుగా తమతో వచ్చి చేరుతారని తిరుగుబాటు యోధులు భావించారు. స్వదేశీ సైనికులు తమతో చేరినట్టయితే రెసిడన్సీని ఇట్టే స్వాధీనం చేసు కోగలమని అంచనావేశారు. ఆ అంచనాలకు భిన్నంగా జరిగింది.

ఆ సందర్బంగా రెసిడెన్సీ రక్షణకు వచ్చిన ఒక ఆశ్వికదళ రిసాల్‌దారు ఇస్మాయిల్‌ ఖాన్‌కు రొహిల్లా యోధులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆ రిసాల్‌దారు తిరుగుబాటు యోధుల ఊహలకు వ్యతిరేకంగా రెసిడెంటు పక్షంవహిస్తూ రొహిల్లా యోధులతో మాట్లాడాడు. అందుకు ఆగ్రహించిన తిరుగుబాటు యోధులు ఆ రిసాల్‌దారు మీద కాల్పులు జరిపారు. ఆ కాల్పుల నుండి తప్పించుకున్న ఇస్మాయిల్‌ ఖాన్‌ తన గుర్రం మీద రెసిడెన్సీలోకి పారిపోయాడు. ఆ చర్యతో ఇరుపక్షాల మధ్యన పోరు ఆరంభమైంది.

బ్రిటిష్‌ రెసిడెన్సీకి రక్షణ బాధ్యతలు స్వీకరించిన Mjor Briggs వ్యూహాత్మకంగా రోహిల్లా యోధు లను చెదరగొట్టేందుకు ఎటువంటి ప్రయత్నమూ చేయ లేదు . తిరుగుబాటు యోధులు ఆక్రమించుకుని ఉన్న భవంతులను, ఇతర గృహాలను తన బలగాలతో చుట్టు ముట్టాడు. ఆ గృహాలను, భవంతులను అరబ్బు దళాలతో కాపుగాయించాడు. దాడిని ఆరంభించిన రోహిల్లా యోధులు ఆ పక్కనే ఉన్న అజీం అలీ ఖాన్‌ భవంతి గోడను పగులగొట్టి రెసిడెన్సీ వైపుకు దూసుకువెళ్ళేందుకు ప్రయత్నించారు. ఆ ప్రమాదాన్ని పసిగట్టిన ఆంగ్లేయాధికారి తిరుగుబాటు యోధుల మీద కాల్పులు జరిపించాడు.

ఆ ప్రతికూల వాతావరణంలో కూడా తిరుగుబాటు యోధులు ఏమాత్రం వెనుకాడలేదు. అస్త్రశస్త్రాలను శత్రువు మీద సంధించారు. ఒకవైపున తిరుగుబాటు యోధులు శత్రువు మీద కాల్పులు జరుపుతుండగా మరోవైపున మరికొంత మంది పుత్లీబౌలి వైపున ఉన్న రెసిడెన్సీ గేట్ల మడతబందులను విరగ్గొట్టారు. ఆ వైపు నుండి

154