పుట:1857 ముస్లింలు.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రదేశ్ ముస్లింలు


బ్రిటిష్‌ రెసిడెంటు కల్నల్‌ డేవిడ్‌సన్‌ తన దళాలను తాను నమ్మలేకపోవటమే కాకుండ తన అంగరక్షకులను కూడ నమ్మలేని పరిస్థితులు నిజాం సంస్థానంలో నెలకొన్నాయి.నిజాం సంస్థానం పరగణాలో తిరుగుబాటు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున సంగతి పసిగట్టిన ఓ ఆంగ్లేయాధికారి పరిస్థితి తీవ్రతను వివరిస్తూ నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఎటువింటి పనికైనా సిద్ధపడే 20 వేల మంది ముస్లింలు ఆయుధాలు సిద్ధాంచేసుకుంటున్నారని తెలిసింది. వీరంతా రహస్యంగా ఈ పని చేసున్నారని తగిన సమయం కోసం ఎదాురు చూస్తున్నారని తెలిసింది. ప్రస్తుతానికి ఏ విధామైన తిరుగుబాటు చిహ్నలు బహిరంగంగా లేకున్నా భవిష్యత్తులో తిరుగుబాటు జరగదాని ఊహించలేము ఆని ఉన్నతాధికారులకు వరమానం పంపాడు. (నిజాం-బ్రిీష్‌ సంబంధాలు, సరోజిని రగాని,పేజి.327)

చారిత్రక మక్కామసీదు సమావేశం

ఆ వాతావరణానికి తగ్గట్టుగానే చిద్దాఖాన్‌ వ్యవహారం మీద 1857 లై 17న నగరంలోని చారిత్రక మక్కా మసీదు వద్ద ప్రజలు, ప్రముఖులు సమావేశమయ్యారు.నిజాం వద్దకు నలుగురు మౌల్వీలను పంపి, రెసిడన్సీలో బందీగా ఉన్న చిద్దాఖాన్‌, ఆయన అనుచరులను విడుదల చేయాల్సిందిగా నిజాంకు విజ్ఞప్తి చేయాలని ఆ సమావేశంలోనిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు తమ విజ్ఞప్తిని నిజాం మన్నించకుంటే చివరి అస్త్రంగాబ్రిటిష్‌ రెసిడెంటు నివాసముంటున్న రెసిడెన్సీ మీద దాడి చేయాలని ఆ సమావేశంలో తీర్మానించారు.

మక్కామసీదు తీర్మానం మేరకు ఓ ప్రతినిధివర్గాన్ని ప్రజలు నిజాం వద్దకు పంపారు. ఆ ప్రతినిధివర్గం చిద్దాఖాన్‌, అయన అనుచరులను విడుదల చేయాల్సిందిగా నిజాంకు విజ్ఞప్తి చేసింది. ప్రజలు ఊహించిన విధంగానే మౌల్వీల విజ్ఞప్తిని నిజాం మన్నించలేదు. చిద్దాఖాన్‌ ఆయన అనుచరులను విడుదల చేయించ డానికి నిజాం అంగీకరించలేదు. నిజాం తీసుకున్న ప్రతికూల నిర్ణయంతో మరింతగా ఆగ్రహించిన ప్రజలు, యోధులు మక్కా మసీదు తీర్మానం మేరకు బ్రిటీషు రెసిడెన్సీ మీద దాడికి సిద్ధమయ్యారు.

ఈ సాహసోపేత నిర్ణయం గురించి నిజాంకు తెలిసింది. ఆయన ఆఘమేఘాల

151