పుట:1857 ముస్లింలు.pdf/153

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
1857:ముస్లింలు


మందికి కొరడా దెబ్బల శిక్ష విధించాం...ఇంకా మేము చేయాల్సిన ఇటువింటి పని ఎంతో ఉంది. (నిజాం-బ్రిటిష్‌ సంబంధాలు, సరోజిని రేగాని, మీడియా హౌస్‌ పబికేషన్స్‌ ,హైదారాబాద్‌, 2002, పేజి. 326)

ఈ నేపథ్యంలో 1857 జూన్‌ 12న నిజాం సరిహద్దులోని బుల్దానాలో ఉన్న హైదారాబాద్‌ కాల్బలంస్వదేశీ సైనికాధికారి జమేదార్‌ చిద్దాఖాన్‌ నాయకత్వలో తిరగబడింది. తిరగబడిన సైనికులు స్థావరాలు వదలి వెళ్ళిపోయారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడానికి నిజాం సహాయం కోరేందుకు తిరుగుబాటు వీరుడు చిద్దాఖాన్‌ నేతృత్వలో పదిమంది వీరసైనికులు జూన్‌ 24న హైదారాబాద్‌ వచ్చారు. ఆంగ్లేయుల స్నేహితుడైన నిజాం తిరుగుబాటు యోధులకు సహాయం చేసి బ్రిటీషర్లతో శత్రుత్వం కొని తెచ్చుకోఫడానికి సిద్ధంగా లేడు. అందువలన చిద్దాఖాన్‌ నగర ప్రవేశం చేయగానే ఆయనను, ఆయన అనుచరులను అరెస్టు చేయించాడు. అరెస్టు చేయడమే కాదు ఆ యోధులను బ్రిటీష్‌ రెసిడెంటుకు అప్పగించాడు. ఈ సంఘటన నగరంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఈ చర్యతో ప్రజలలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి.


ఈ ఆగ్ర హావేశాలు ఖచ్చితం గా తిరుగుబాటుదిశగా పయనించి రూపుదిద్దు కోసాగాయి. నగరంలో ప్రతి మసీదు మీద ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇది ఇలా ఉండగా ఢిల్లీలోస్వదేశీ యోధులు పూర్తిస్థాయి విజయం సాధించి ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకుల పెత్తనానికి చరమగీతం పాడటం జరిగింద న్న వర్తమానం స్థానికులలో,స్వదేశీ సైనికులలో, పోరాట యోధులలో ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహం తో అటు సైనికులు ఇటు ప్రజలు బహిరంగంగా తిరుగుబాటుకు అమితోత్సాహాన్ని ప్రదర్శించ సాగారు.

ఈ విషయాన్ని పసిగట్టిన ఇంగ్లీష్‌మన్‌ అను ఆంగ్ల పత్రిక 1857జూన్‌ 27నాటి సంచికలో ఆ సమాచారాన్ని ప్రకటించింది. ఆ సంచికలో హైదారాబాదులో అల్లరు చెలరేగేసూచనలున్నాయి. సైనికులలో అశాంతి ప్రబలి ఉంది. ఇస్లాం మత ధర్మ పరిరక్షణ కోసం మతధ్వజం ఎత్తాలని ఉన్నత స్థాయికి చెందిన ఫకీర్లు ముఖ్యం గా ఖామూష్‌ షాహ్‌ అదేపనిగా సెనికుల్లో ప్రచారం చేసున్నారు. ఇక మౌల్వీ అక్బర్‌ అనే ప్రచారకుడు మసీదు ల్లోఎడతెరపి లేకుండా ప్రచారం చేసినాడు అని రాసింది.అంతర్గతంగా వ్యాపిస్తున్న తిరుగుబాటు జ్వాలలు ఏ స్థాయిలో ఉన్నాయంటే

150