పుట:1857 ముస్లింలు.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రప్రడేశ్‌ ముస్లింలు

భయానక శిక్షలకు భయపడని యోధులు

బ్రిటిషర్ల ఆజ్ఞలను ధిక్క రించిన స్వదేశీ సైనికులు, సెన్యాధికారులను ఉద్యోగాల నుండి తొలగించారు. పలువురికి కఠిన శిక్షలు విధించారు. ఉరిశిక్షలు, ఫిరంగులకు కట్టి పేల్చివేయటం సాధారణ విషయ మైంది. ప్రభుత్వం ఎంత కిరాతకత్వానికి పాల్పడినా తిరగబడ్డ యోధులు మాత్రం శిక్షలకు ఏమాత్రం వెరవలేదు; భయకంపితులు కాలేదు. ఆ యోధులు మరణశిక్షలను కూడ ప్రశాంతంగా స్వీకరించి ఆంగ్లేయాధికారులను ఆశ్యర్యచకితుల్ని చేశారు. ఆ మారణకాండకు సంబంధించిన భయానక దాృశ్యాలను బ్రిటిషు అధికారులు కూడ స్వయంగా చూడలేకపోయారు !

ఈ విషయాన్ని బ్రిటిష్‌ సైనికాధికారి Captain Abbot తన వారికి రాసిన లేఖలలో వివరంగా పేర్కొన్నాడు. ఎంతమంది యోధులను ఎలా ఉరితీసిందీ, ఎలా ఫిరంగులకు కట్టి పేల్చి వేసిందీ, ఎంతమందికి ఏ విధంగా శిక్షలు వేసిందీ ఆయన తెలిపాడు. ఆ సమయంలో తిరుగుబాటు యోషు లలో కన్పించిన నిర్బయ త, ప్రశాంతతలను కూడ ఆ ఆంగ్లేయుడు తన ఉత్తరాలలో నమోదుచేశాడు.

ఆనాటి శిక్షల అమలు, ఆయా సంఘటనల విశేషాలను Captain Abbot ఈ విధంగా వివరించాడు

మేం మొదట పట్టుకుహన్న 94 మంది ఖైదీలలో ఒకరిని ఉరితీశాం. నల్గురిని కాల్చి చంపాం. ఒకడ్ని ఫిరంగులతో పేల్చివేశాం. ఆ దృశ్యం ఎంతో భయంకరంగా ఉంది. వాడి తల దాదాపు 20 గజాల పైకి ఎగిరింది. వాడి రెండు చేతులు రెండు వైపులకు దాదాపు ఎనిమిది గజాల దూరంలో పడ్డాయి. వాళ్ళు ఎంతో మామూలుగా తమకు విధించిన శిక్షలను గురించి వినటం చూసి ఆశ్చర్యపోయాను. ఫిరంగి ముందు నిలబడ్డ వ్యక్తి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వారు భగవంతుని ఎదుట సమాధానం చెప్పవలసి వస్తుందని ప్రకటించాడు. తన్ను ఫిరంగికి కట్టవద్దని కోరాడు. తాను భయపడనని అన్నాడు. నన్నునేను శుభ్రపర్చుకున్నాను. దాంతో నాపాపాలన్నీ కడిగేసుకున్నాను. ఎంత త్వరగా నేను స్వర్గానికి వెడితే అంత సుఖం అని ఉరితీయబడిన వ్యక్తి అన్నాడు...పట్టుబడ్డ ఖైదీలలో ఇద్దర్నిపేల్చివేశాం, మరో నలుగురిని కాల్చి చంపాం. నల్గురికి శిక్ష తగ్గించాం. మరో వంద మంది నిరాయుధుల్ని చేసి వెళ్ళగొట్టాం. ఓ యాభై

149