పుట:1857 ముస్లింలు.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు


నిరసిస్తూ ప్రజలు ముందుకు రాసాగారు. ఈ మేరకు సాగిన ఆంగ్లేయ వ్యతిరేక ప్రచార కార్యక్రమాలలో ప్రధానంగా ముల్లాలు, మషాయక్‌లు, పేష్‌ ఇమాంలు పాల్గొన్నారు. ఆంగ్లేయులకు బద్ద విరోధులుగా మారి రాత్రింబవళ్ళు బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలలోవారు పాల్గొన్నారు. ఆనాడు ప్రజలలో పొడచూపిన ఈ వ్యతిరేకత ఆంగ్లేయుల వరకు పరిమిత మైంది. నైజాం సంస్థానాధీశుడి పట్ల గౌరవం కలిగిన ప్రజలు ఆయనను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాఫడాల్సింది గానూ, ఈస్ట్‌ ఇండియా కంపెనీ అధికారులు పెత్తనం నుండి, ఆధిపత్యం నుండి విముక్తం కావాల్సింది గా కోరుతూ తొలిదశలో విజ్ఞప్తులు పంపుకున్నారు.

ఈ కదలికకు ఉత్తర భారతదేశంలో ప్రారంభమైన తిరుగుబాట్లు ప్రేరణగా నిలిచాయి. పరాయి పాలకుల మీద సమరం సాగించేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న పోరాటశక్తులు తక్షణమే ఆయుధాలను చేపట్టి బ్రిటిష్‌ పాలకులను సవాల్‌ చేశాయి. ఉమ్మడి శతృవును ఎదుర్కొనేందుకు హిందూ-ముస్లింల ఐక్యతను కాంక్షిస్తూ ప్రజలను పోరాటదిశగా సాగమని ప్రతి ఒక్కరినీ కోరారు. ఆ ప్రయత్నాలలో భాగంగా సాగిన విజ్ఞప్తులకు స్పందించని నిజాం నవాబును హేళన చేస్తూ తిరగబడ మంటూ, కాదు కూడదంటే గాజులు తొడుక్కొని కూర్చోమని ప్రకటనలు, ప్లకార్డులు హైదారాబాదు నగరంలో వెలిశాయి.

ఆ ప్లకారులలో బహదూర్‌ అఫ్జలులుద్దౌలా మీద భగవంతుని, ముహమ్మద్‌ ప్రవక్త దయ ఉంది. ఆయన భయపడకుండా ఉండాలి. ఒకవేళ భయపడినట్టయితే గాజులు తొడుక్కొని ఇంటి దగ్గర కూర్చోవడం మంచిది...ఈ పోస్టర్లలో రాసిన ప్రకారంగా బహుదాూర్‌ ప్రవర్తించనట్టయితే ఢిల్లీ నుండి ఇంకోక సుబా వస్తుంది అని వ్యంగంగా రాశారు. (నిజాం-బ్రిటిష్‌ సంబంధాలు (1727-1857), సరోజినీ రెగానీ, మీడియా హౌస్‌ పబ్లికేషన్స్‌,హైదారాబాద్‌, 2002 పేజి. 319-320)

చివరకు ఈ పరిస్థితి ఎంత దూరం పోయిందంటే, ఈ వినతిని చదివిన వ్యక్తులు గాని, ఈ విషయం తెలుసుకున్న ఎవరైనా గాని ప్రకటించిన మేరకు నిజాంకు, ఆయన దివాన్‌కు ఆ విషయం తెలుపకు న్నా, ప్రకటనలను అక్కడి నుండి తొలగించినా అటువంటి వారు దేవుడు, ప్రవక్త శాపానికి గురవుతారని తీవ్రంగా హెచ్చరించే వరకు వెళ్ళింది. ఈ రకమైన ప్రకటనలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, అందులో పొడచూపిన వ్యంగాన్ని,

143