పుట:1857 ముస్లింలు.pdf/141

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

వారు కారని, ఈ సంఘటన ఈ ప్రాంతంలో ఆంగ్లేయుల ప్రాబల్యాన్ని తేరు కోలేని స్థాయిలో దెబ్బతీసిందని ఆ లేఖలో వివరించాడు. (The Sepoy Revolt of Vizagapatnam, 1780, B.Kesavanarayana, P. 183).

ఈ తిరుగుబాటు విషయమై ఆంధ్ర విడశ్వవిద్యాలయం చరిత్ర శాఖాధిపతి డాక్టర్‌ కొల్లూరు సూర్యనారాయణ రచయితతో మ్లాడుతూ భారత దేశంలోనే తొట్టతొలుత సిపాయీల తిరుగుబాటు 1780 అక్టోబరు 3న విశాఖపట్నంలో జరిగింది. ఆ తిరుగుబాటు శంఖారావాన్ని పూరించిన వ్యక్తి, నాయకక్త్వం వహించిన వ్యక్తి షేక్‌ సుబేదార్‌ అహ్మద్‌. అయితే సురదాృష్టవశాత్తు మంగళపాండే మాత్రమే ప్రజలకు తెలుసు. ఈ తిరుగుబాటు నాయకుడైన తెలుగు బిడ్డడు సుబేదార్‌ అహ్మద్‌ సాహసకృత్యానికి, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి 77 ఏండ్లకు పూర్వమే తెలుగు గడ్డ మీద ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన తొలి సిపాయిల తిరుగుబాటుకు తగినంత ప్రాచుర్యం లభించక పోవటం నిజంగా సురదృ ష్టకరం, అన్నారు. (డాక్టర్‌ సూర్యనారాయణతో ఇంటర్వూ, 28 నవంబర్‌, 2006) 1780లో విశాఖపట్నం సైనిక స్థావరంలో తిరుగుబాటు జరిగాక, 1806లో తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు, 1824లో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లలో సిపాయిలు తిరుగుబాటు చేసన చారిత్రక సంఘ టనలున్నాయి. ఆ తరు వాత హైదారాబాదు, ఔరంగాబాదు లాంటి ప్రాంతాలలో 1857 కంటే ముందు సిపాయీలు తిరుగబడిన సంఘటనలు ఉన్నాయి.

ఆ సంఘటనల మీద ఆయా ప్రాంతాలలోని రాష్ట్రప్రభుత్వాలు దృష్టిసారించి, ఆ చారిత్రక సంఘటనలు జరిగిన ప్రాంతాలకు, ఆయా తేదీలకు తగినంత ప్రాధాన్యత కల్పిస్తూ తిరుగుబాటు యోధు లను స్మరించుకుంటూ పలు కార్యక్రమాలు జరుపుతున్నాయి. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకు చాలా ఆదర్శంగా ఉంది. తమిళనాడు గడ్డ మీద జరిగిన ప్రతి చారత్రిక ఘట్టానికి అధిక ప్రాధాన్యతనిసూ, 1806లో వెల్లూరులో జరిగిన తిరుగుబాటు సంఘటనకు ప్రజలలో తగినంత ప్రాచుర్యం కల్పిస్తూ, అలనాటి యోధులను స్మరిస్తూ ప్రతి ఏటాకార్యక్రమాలు నిర్వహించటమే కాదు తొలి సైనిక తిరుగుబాటు తమ గడ్డ మీద 1806లోనే జరిగిందంటూ ప్రచారం కూడ కల్పించింది. ఆ క్రమంలో ఈ మధ్యనే వెల్లూరు తిరుగుబాటు యోధుల గౌరవార్థం తపాలా బిళ్ళను కూడ తమిళనాడు ప్రభుత్వం విడుదల చేసింది.

138