పుట:1857 ముస్లింలు.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


1859లో ఆగ్రా నుండి 'తారీఖ్‌-యే-బగావత్‌-యే-హింద్‌' (Tarikh-iBaghavat-i-Hind) ప్రచురితమైంది. ఈ పత్రిక తన పేరులోనే 'తిరుగుబాటు చరిత్ర' అను మాటను చేర్చుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించింది. తారీఖ్‌ -యే-బగావత్‌-యే- హింద్‌ ను డాక్టర్‌ ముకుందా లాల్‌ అను ప్రముఖులు ఆరంభించారు. ఆంగ్లేయుల అరాచకం పట్ల ఏమాత్రం భయపడకుండా ఆనాడు ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా జరుగుతున్న సంఘటనల వివరాలను ప్రజలకు తారీఖ-యే- బగావత్‌-యే-హింద్‌ అందించింది. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టమని ప్రజలను కోరుతూ ఆనాటి ప్రముఖ తిరుగుబాటు యోధులు జారీ చేసిన ప్రకటనలను యధాతధంగా ఈ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ప్రజలను, తమ తమ మతధర్మాలను అనుసరిస్తూ స్వదేశీ ప్రభువుల పక్షంగా పోరుబాట నడిచేందుకు, ప్రజలకు సేవలు అందించడానికి తరలి రావాల్సిందిగా కోరుతూ కాన్పూరు తిరుగుబాటు నాయకులునానా సాహెబ్‌ జారీ చేసిన ప్రకటనను ప్రముఖంగా ప్రచురించింది.

1860లో అజ్మీర్‌ నుండి ప్రచురణ ఆరంభించిన 'ఖైరఖాహ్‌-యే-ఖలఖ్‌ ( Khairkhuah -i-Khalq) అను పత్రిక ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం పూర్తిగా 1859 డిసెంబరు నాటికి సమసిపోయినా తిరుగుబాటు వారసత్వాన్ని కొనసాగించింది. 1857 నాటి తిరుగుబాటు విఫలయ్యాక భారతీయ సైనికుల పట్ల ఘోరంగా వ్యవహరిస్తున్న ఆంగ్లేయాధికారుల దుష్టచర్యలను, వారి దుష్ట నైజాన్ని ఎండగడ్తూ, ఆయా సంఘటనల వివరాలతో సహా ప్రచురించింది. ఈ ధోరణి వలన అతి త్వరలో కంపెనీ పాలకుల ఆగ్రహానికి గురై ఖైరఖాహ్‌-యే-ఖలఖ్‌ నిషేధించబడింది.

ఆంగేయులకు వ్యతిరేకంగా ప్రదమ స్వాతంత్య్రసంగ్రామం ఆరంభానికి పూర్వం నుండే తిరుగుబాటు బీజాలు ప్రజల హృదయాలలో నాటడానికి, తిరుగుబాటు ఆరంభమయ్యాక తిరుగుబాటు దిశగా ప్రజలను నడిపించల ప్రేరణ కల్పించేందుకు, పోరాట యోధులు శత్రువును తునుమాడుతూ ముందుకు సాగిపోగల పోరాట స్పూర్తిని అందిస్తూ, తిరుగుబాటు సమసిపోయాక కూడా ప్రజలలో స్వేచ్ఛ-స్వతంత్ర భావాలను సజీవంగా ఉంచేందుకు ప్రజల పక్షం వహించిన పత్రికలు ఆ దిశగా అవిశ్రాంతంగా కృషి సల్పాయి.

133