పుట:1857 ముస్లింలు.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

ఈనాటి ప్రజానీకంలో కూడ మాతృదేశ భక్తి భావాలను రగిలించే జాతీయ గీతం స్థాయి కలిగి భావి తరాలకు స్పూర్తిని అందిస్తుందనడం సత్యదూరం కాబోదు. ఆ కారణంగా ప్రథామ స్వాతంత్య్రసంగ్రామం 150 సంవత్సరాల సంబరాల సందర్భంగా 150 సంవత్సరాల క్రితం మౌల్వీలియాఖత్‌ అలీ రాసిన 'పయాం-యే-అమల్‌' గీతం దూరదర్శ న్‌ ద్వారా ప్రజలకు వినబడటం సంతోషదాయకం.

ఢల్లీ ఉర్దూ అఖ్బా తరహాలో పయామే ఆజాది, సాదిఖుల్‌ అఖ్బార్‌, కోహినూర్‌, తిల్సిం-యే-లక్నో, సహర్‌-యే-సమ్రి లాంటి పలు పత్రికలు, ఆ పత్రికల సంపాదకులు 1857 తిరుగుబాటు సాగుతున్నంత కాలం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజల మనోభావాలను మరింత పటిష్టం చేస్తూ పోరాట యోధులకు తోడ్పడ్డాయి. స్వదేశీ సైనికులకు తోడుగా నిలవడానికి ఆఫ్గనిస్తాన్‌ బలగాలు తరలి వస్తున్నాయంటూ ఇటు ప్రజలలో అటు పోరాట వీరులలో పోరాట స్పూర్తిని సజీవంగా ఉంచగలిగాయి. ఆ కారణంగా ఆంగ్లేయాధికారుల క్రూరత్వానికి ఆ పత్రికల సంపాదకు లు గురవుతూ వచ్చారు.

ఈ పత్రికలన్నీ 1857కు ముందు ఆరంభింపబడి 1857 తిరుగుబాటు కాలంలో ప్రజల పక్షంగా తమ బాధ్యతలను నిర్వహించాయి. బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులు తిరుగు బాటుకు అనుకూలంగా వ్యవహరిసున్న పత్రికలు, ఆ పత్రికల సంపాదకుల పట్ల ఎంత నిర్దాక్షిణ్యాన్ని ప్రదర్శించినా స్వేఛ్చా-స్వాతంత్య్రాల సాధన ప్రదాన లక్ష్యంగా గల పలువురు అక్షర యోధులు 1857 తరువాత కూడా పలు పత్రికలను ఆరంభించారు. ఈ పత్రికలు ఆనాడు జరుగుతున్న పోరాటాల సమాచారాన్ని ఉత్కంఠత కలిగించే విధంగా ప్రజల దృష్టికి తెస్తూ సమరయోధులకు నైతిక బలాన్ని అందించటంలో కృతకృత్యులయ్యాయి.

1858లో ప్రారంభమైన 'అవధ్‌ అఖ్బార్' (Oudh Akhbar) ఆంగ్లేయుల అరాచకాలను ఎండగడుత్తూ ప్రజల ముందుకు వచ్చింది. ఈ పత్రికను మున్షీ నావల్‌ కిషోర్‌ స్థాపించారు. ఆంగ్లేయుల అరాచకాలను తట్టుకుంటూ నిలబడిన అవధ్‌ అఖ్బార్ 1874లో దినపత్రిక అయ్యింది. ఈ ప్రతిక ప్రధానంగా లౌకిక వ్యవస్థ పునాదుల మీద హిందూ-ముస్లింల మధ్య ఐక్యత కోసం ఎంతగానో కృషిచేసింది. లౌకిక-సర్దుబాటు భావనలతో కొనసాగిన ఈ పత్రిక 90 సంవత్సరాల పాటు ప్రజల విశేష ఆదరణ పొందింది.

132