పుట:1857 ముస్లింలు.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలం యోధులు


దీని భాగ్యము శాంతి సౌఖ్యములు వెలుగు చిమ్మును జగమంతా అతి ప్రాచీనం ఎంతో ధాటి దీనికి లేదుర ఇలలో సాటి గంగా యమునలు పారు నిండుగ మానేలల్లో బంగరు పండగ దిగువున పరుచుకున్న మైదానాలు దిగ్గున ఎగసే సంద్రపుటలలు మంచునిండిన ఎత్తు కొండలు కావలి దండిగ మాకు అండగ దూరం నుండి వచ్చిన దుష్టులు చేసిరి కంతిరి మాయ చేష్టలు జాతికి ఘనమౌ దేశాన్నంతా-దోచివేసిరి రెండు చేతులా అమరవీరులు విసిరిన సవాలు-దేశవాసులు వినరండి బానిస సంకెలు తెంపండి నిప్పులవానై కురండి హిందూ ముస్లిం సిక్కులందరం ప్రియాతి ప్రియమౌ సోదరులం ఇదిగిదిగో మన స్వతంత్ర జెండా చేస్తాం సలాము గుండెల నిండా ! ఈ విధంగా అటు స్వదేశీ పాలకుల ప్రకటనలతో పాటుగా, పోరాట యోధులు స్వయంగా రాసిన ప్రబోధ గీతాలను ప్రచు రిస్తూ పలు ప్రాంతాలలో సాగుతున్న స్వాతంత్య్ర సంగ్రామ పోరాట ఘట్టాలను, తిరుగుబాటు యోధుల ఘనవిజయాలను ఏకరు వు పెడుతూ అజీముల్లా ఖాన్‌ సంపాదకత్వంలో వెలువడిన 'పయామే ఆజాది' (Payame Azadi)ప్రథమ స్వాతంత్య్రోద్యమంలో ప్రజల పక్షం వహించి బృహత్తర పాత్రను నిర్వహించింది.

మౌల్వీ లియాఖత్‌ అలీ రాసిన 'పయాం-యే-అమల్‌' గీతం అలనాటిదైనా

131